Earthquake | మూడు రాష్ట్రాలను వణికించిన భూకంపాలు..
Earthquake | మూడు రాష్ట్రాలను భూకంపాలు వణికించాయి. అసోం, ఉత్తరాఖండ్, మహిమాల్చల్ ప్రదేశ్‌లో ప్రకంపనలు నమోదయ్యాయి. అసోంను భూకంపం వణికించింది.
Earthquake | మూడు రాష్ట్రాలను భూకంపాలు వణికించాయి. అసోం, ఉత్తరాఖండ్, మహిమాల్చల్ ప్రదేశ్‌లో ప్రకంపనలు నమోదయ్యాయి. అసోంను భూకంపం వణికించింది. తేజ్‌పూర్‌లో బుధవారం ఉదయం వేకువ జామున 5.55 గంటలకు 3.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) తెలిపింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇండ్ల నుంచి పరుగులు పెట్టారు. భూకంప కేంద్రాన్ని 20 కిలోమీటర్ల లోతులో, తేజ్‌పూర్‌కు తూర్పున 42 కిలోమీటర్ల దూరంలో గుర్తించినట్లు పేర్కొంది.
స్వల్ప భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం కలుగలేదని అధికారులు పేర్కొన్నారు. అంతకు ముందు ఉత్తరాఖండ్‌లో భాగేశ్వర్‌లో అర్ధరాత్రి దాటిన తర్వాత 12.47 గంటల సమయంలో రిక్టర్ స్కేల్‌పై 2.1 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. భూకంప కేంద్రాన్ని భూమికి ఐదుకిలోమీటర్ల లోతులో గుర్తించారు. హిమాచల్‌ప్రదేశ్ కిన్నౌర్‌లో 2.7 తీవ్రతతో భూమి కంపించింది. జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, నాగాలాండ్‌లో మంగళవారం పలుచోట్ల భూ ప్రకంపణలు నమోదయ్యాయి. ఉత్తరాఖండ్ చమోలిలో రిక్టర్ స్కేల్‌పై 1.8 తీవ్రతతో, మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలిలో 3.3 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

