Dense Fog | ఢిల్లీ గజగజ.. 110 విమాన రాకపోలకు అంతరాయం
Dense Fog | ఉత్తర భారతంలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా దేశ రాజధానిలో ఉష్ణోగ్రతలు 7 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో రాజధాని ప్రాంతాన్ని దట్టమైన పొగ కమ్మేసింది (Dense Fog). ఉదయం 8 గంటలు అవుతున్నా చీకటిగానే ఉంది.
Dense Fog | ఉత్తర భారతంలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా దేశ రాజధానిలో ఉష్ణోగ్రతలు 7 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో రాజధాని ప్రాంతాన్ని దట్టమైన పొగ కమ్మేసింది (Dense Fog). ఉదయం 8 గంటలు అవుతున్నా చీకటిగానే ఉంది. 50 మీటర్ల దూరంలోని వాహనాలు కూడా కనిపించని పరిస్థితి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో వాతావరణ శాఖ ఢిల్లీలో రెడ్ అలర్ట్ ప్రకటించింది.
భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. పాటియాలా, లక్నో, ప్రయాగ్‌రాజ్‌లలో విజిబిలిటీ 25 మీటర్లుగా ఉంది. ఇక అమృత్ సర్‌లో ఏకంగా జీరోకు పడిపోయింది. విజిబిలిటీ ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని పాలెంలో 125 మీటర్లు, సఫ్దార్జంగ్ అబ్జర్వేటరీలో 50 మీటర్లుగా ఉంది. మరోవైపు పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పొగమంచు పరిస్థితులు తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది.
ఆలస్యంగా నడుస్తున్న 110 విమానాలు, 25 రైళ్లు..
ఈ పొగ మంచు రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కొన్ని మీటర్ల దూరంలోని వాహనాలు కూడా కనిపించని పరిస్థితి. పొగ మంచు దట్టంగా కమ్మేయడంతో పలు చోట్ల దృశ్యమానత జీరోకు పడిపోయింది. ఈ కారణంగా ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. బుధవారం దాదాపు 110 దేశీయ, అంతర్జాతీయ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా ఢిల్లీకి రావాల్సిన పలు విమానాలను దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు అటు రైళ్ల రాకపోకలపై కూడా పొగమంచు తీవ్ర ప్రభావం చూపిస్తోంది. రాజధానికి రావాల్సిన సుమారు 25 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఉత్తర రైల్వే వెల్లడించింది.
క్షీణించిన గాలి నాణ్యత..
ప్రస్తుతం ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోగా.. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 24 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. చలికి తోడు రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యత కూడా బాగా క్షీణించింది. సగటు గాలి నాణ్యత 381కి పడిపోయింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం.. ఆనందర్ విహార్ ప్రాంతంలో ఏక్యూఐ 441గా ఉంది. ఇక సెంట్రల్ ఢిల్లీలోని లోధి రోడ్డులో 327, అంతర్జాతీయ విమానాశ్రయంలో గాలి నాణ్యత 368గా ఉంది. ఘజియాబాద్, నోయిడాలో 336, 363గా ఉంది. వచ్చే వారంలో గాలి నాణ్యత మరింత దిగువకు పడిపోయే అవకాశం ఉందని అంచనా.
కాగా, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి, కాలుష్యం లేదని, AQI 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉందని అర్థం. ఇక AQI 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని, AQI 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, AQI 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని అర్థం చేసుకోవచ్చు. కాగా, ఈ మధ్య ఢిల్లీలో వాయు కాలుష్యం ఆందోళనకరంగా మారుతున్నది.
Also Read..
Lee Sun-kyun: పారాసైట్ చిత్ర నటుడు లీ కున్ అనుమానాస్పద మృతి
Chennai Super Kings | అమెరికాలో సూపర్ కింగ్స్ అకాడమీ.. పసుపు జెర్సీలతో నిండిపోనున్న డల్లాస్
Asaduddin Owaisi | ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ ఉర్దూలోనూ ఉండాలి : అసదుద్దీన్ ఒవైసీ
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Delhi
- dense fog
- IMD
- visibility
RELATED ARTICLES
తాజా వార్తలు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
Ramayana | రూ.5000 కోట్ల వసూళ్లు సాధిస్తేనే సేఫ్.. భయపెడుతున్న ‘రామాయణ’ బ్రేక్ ఈవెన్ టార్గెట్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

