Chennai Super Kings : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ఐదో ట్రోఫీతో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) సారథ్యంలో రికార్డు టైటిల్ సాధించిన సీఎస్కే ఫ్రాంచైజీ అంతర్జాతీయ లీగ్స్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే మేజర్ క్రికెట్ లీగ్(Major Cricket League)లో సూపర్ కింగ్స్ యాజమాన్యం టెక్సాస్(Texa) జట్టును కొనుగోలు చేసింది. అంతటితోనే పరిమితం కాకుండా టెక్సాస్ పరిధిలో క్రికెట్ అభివృద్ది, విస్తరణకు నడుం బిగించింది. డల్లాస్‌లో త్వరలోనే క్రికెట్ అకాడమీ(Super Kings Academy)ని ఏర్పాటు చేసింది.
అమెరికాలో క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో ఇక్కడ క్రికెట్‌ను కొత్త పుంతలు తొక్కిస్తాం. క్రికెట్‌పై ఆసక్తి ఉన్న అమెరికా యువకుల ప్రతిభను సానబెడుతాం. టెక్సాస్ సూపర్ కింగ్స్‌కు డల్లాస్ సొంతూరు లాంటింది. ఇక్కడ తొలి అకాడమీ పెడుతున్నందుకు ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది అని సూపర్ కింగ్స్ అకాడమీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ లూయిస్ మరియానో(Louis Mariano) తెలిపాడు.
ఐపీఎల్ ట్రోఫీతో ధోనీ, రాయుడు, జడేజా
నిరుడు మేజర్ క్రికెట్ లీగ్ తొలి సీజన్లో నిరుడు ఆరు జట్లు పోటీపడ్డాయి. టోర్నీ ఆసాంతం అదరగొట్టిన ముంబై ఇండియన్స్‌కు చెందిన న్యూయార్క్ జట్టు చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో సియాటెల్ ఒర్కాస్ జట్టును 6 వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీని ఎగరేసుకుపోయింది. ఎంసీఎల్ రెండో సీజన్ వచ్చే ఏడాది వేసవిలో జరుగనుంది.