Boxing Day Test : ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య మెల్బోర్న్ స్టేడియంలో బాక్సింగ్ డే టెస్టు(Boxing Day Test)కు రసవత్తరంగా జరుగుతోంది. తొలిరోజు వర్షం అంతర్యాంతో 3 వికెట్ల నష్టానికి 187 రన్స్ కొట్టిన ఆసీస్.. రెండో రోజు తొలి సెషన్లో మరో 131 పరుగులు చేసి ఆలౌటయ్యింది. అనంతరం ఇన్నింగ్స్ మొదలెట్టిన పాక్ వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. ఓపెనర్ అబ్దుల్లా షఫిక్(37), కెప్టెన్ షాన్ మసూద్(13) నిలకడగా ఆడుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో పాక్ ఇంకా 255 పరుగులు వెనకబడి ఉంది.
ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా పాక్ బౌలర్ల ధాటికి నిలువలేకపోయింది. పాక్ బౌలర్లు విజృం|భించడంతో 318 పరుగులకే పరిమితమైంది. టెస్టు స్పెషలిస్ట్ మార్నస్ లబూషేన్(63), ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్(41) రాణించడంతో ఆసీస్ ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది.
Three for Aamer Jamal, as Australia have been bowled out for 318
Seven wickets fell in the first session today 👉 https://t.co/o2UAnXbS93 #AUSvPAK pic.twitter.com/PcMoHXrCb7
— ESPNcricinfo (@ESPNcricinfo) December 27, 2023
తొలి సెషన్లోనే డేంజరస్ ట్రావిస్ హెడ్(17)ను షాహీన్ ఆఫ్రిది ఔట్ చేయడంతో కంగారు జట్టు వికెట్ల పతనం మొదలైంది. అయితే.. టెయిలెండర్లతో కలిసి మిచెల్ మార్ష్(41) పోరాడడంతో ఆస్ట్రేలియా మూడొందలు కొట్టగలిగింది. పాక్ బౌలర్లలో అమర్ జమాల్ మూడు, హసన్ అలీ, మిర్ హమ్జా తలా రెండేసి వికెట్లు తీశారు.