Uttar Pradesh | లక్నో : ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా – లక్నో ఎక్స్ప్రెస్ వేపై దట్టంగా పొగమంచు ఏర్పడింది. పొగమంచు కారణంగా విజిబిలిటీ పూర్తిగా తగ్గిపోయింది. దీంతో పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ముందు వెళ్తున్న బస్సును పలు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు.
ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఓ ట్రక్కు ఇంట్లోకి దూసుకెళ్లింది. ఆగ్రాలో మరో రెండు ట్రక్కులు ఢీకొన్నాయి. పొగమంచు కారణంగా యూపీ వ్యాప్తంగా పలుచోట్ల రోడ్డు ప్రమాదాలు సంభవించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
#WATCH | Unnao, Uttar Pradesh: Multiple vehicles collided on the Agra-Lucknow expressway due to dense fog, several people sustained injuries pic.twitter.com/JhPJT0XYxp
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 27, 2023
#WATCH | Uttar Pradesh: Dense fog leads to collision of several vehicles in Agra pic.twitter.com/XNHXYJJqYm
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 27, 2023