అమరావతి : ఏపీలోని విశాఖ జిల్లాలో ఘోరం జరిగింది. ఓ లారీ డ్రైవర్ బీభత్సం వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయ్యారు. గాజువాక( Gajuwaka ) బీహెచ్‌పీవీ కూడలిలో లారీ ట్రాలర్ రెండు కార్లు, మూడు బైకులను ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.