Rahul Gandhi | ఈ పరిస్థితికి ప్రభుత్వ గుత్తాధిపత్యమే కారణం.. ఇండిగో వైఫల్యంపై రాహుల్
Rahul Gandhi | నిర్వహణపరమైన లోపాల వల్ల దేశంలోని అతి పెద్ద ఎయిర్‌లైన్ సంస్థ ఇండిగో (IndiGo) విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం కలుగుతోన్న విషయం తెలిసిందే.
Rahul Gandhi | నిర్వహణపరమైన లోపాల వల్ల దేశంలోని అతి పెద్ద ఎయిర్‌లైన్ సంస్థ ఇండిగో (IndiGo) విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం కలుగుతోన్న విషయం తెలిసిందే. గత మూడు రోజులుగా వందలాది విమానాలను సంస్థ రద్దు చేసింది (IndiGo Flight Cancellations). నేడు కూడా దాదాపు 400కిపైగా విమానాలు రద్దయ్యాయి. ఇండిగోలో నెలకొన్న ఈ సంక్షోభంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తాజాగా స్పందించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
ఈ పరిస్థితికి ప్రభుత్వ గుత్తాధిపత్యమే (monopoly model) ప్రధాన కారణమని ఆరోపించారు. ఎప్పటిలాగే జాప్యాలు, రద్దులు, నిస్సహాయతకు మూల్యం చెల్లించేది సాధారణ పౌరులే అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ‘ఇండిగో విమానాల రద్దు, అంతరాయాల కారణంగా దేశంలో విమానయాన రంగంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇండిగో వైఫల్యానికి ఈ ప్రభుత్వ గుత్తాధిపత్యమే ప్రధాన కారణం. ఎప్పటిలాగే జాప్యాలు, రద్దులు, నిస్సహాయతకు మూల్యం చెల్లించేది సాధారణ పౌరులే. ఇలాంటివి మరోసారి జరగకుండా ఉండేందుకు విమానయాన రంగంతో సహా అన్నింటిలోనూ న్యాయమైన పోటీ ఉండాలి. మ్యాచ్‌ఫిక్సింగ్, గుత్తాధిపత్యాలు కాదు’ అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు. మరోవైపు ఈ పరిస్థితిపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
IndiGo fiasco is the cost of this Govt’s monopoly model.
Once again, it’s ordinary Indians who pay the price – in delays, cancellations and helplessness.
India deserves fair competition in every sector, not match-fixing monopolies. https://t.co/sRoigepFgv
— Rahul Gandhi (@RahulGandhi) December 5, 2025
Also Read..
IndiGo | వరుసగా నాలుగోరోజూ.. 400కిపైగా ఇండిగో ఫ్లైట్స్ రద్దు.. ప్రయాణికులకు తప్పని అవస్థలు
రెక్కలు తెగిన ఇండిగో!.. చుట్టుముట్టిన నిర్వహణా సమస్యలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

