Amit Shah | కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) బీహార్‌లో చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర (Voter Adhikar Yatra) వివాదాస్పదమైంది. ఈ యాత్రలో ఓ వ్యక్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ఫైర్ అయ్యారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇందుకు గానూ మోదీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘అనుచిత వ్యాఖ్యలకు గానూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆయన తల్లి, దేశ ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలి’ అని షా డిమాండ్ చేశారు. ‘మోదీ తల్లి చాలా పేద కుటుంబంలో తన జీవితాన్ని గడిపారు. తన పిల్లలను అత్యున్నత విలువలతో పెంచారు. అలాంటి మనిషిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. దీన్ని దేశ ప్రజలు ఎప్పటికీ సహించరు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ రాజకీయాలు అత్యంత దిగజారాయి. కాంగ్రెస్ పార్టీ దాని పాత స్వభావాన్ని, సంస్కృతిని తిరిగి తీసుకొచ్చింది. దేశ రాజకీయాల్లో విషం నింపుతోంది’ అంటూ షా మండిపడ్డారు.
Also Read..
Bihar: బీహార్‌లో పార్టీ జెండాలతో కొట్టుకున్న కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు.. వీడియో
PM Modi | ప్రపంచం మొత్తం భారత్‌పైనే ఆశలు పెట్టుకుంది.. టోక్యో సదస్సులో ప్రధాని మోదీ
Driver | కోడ్రైవర్‌కు స్టీరింగ్ అప్పగించి.. బస్సులోనే ప్రాణాలు వదిలిన డ్రైవర్