PM Modi | ప్రపంచం మొత్తం భారత్‌పైనే ఆశలు పెట్టుకుంది.. టోక్యో సదస్సులో ప్రధాని మోదీ
PM Modi | భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అని, త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు.
PM Modi | భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అని, త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. ప్రధాని జపాన్ (Japan) పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టోక్యో (Tokyo)లో ఇండియా-జపాన్ ఎకనామిక్ ఫోరం ( India-Japan Joint Economic Forum)లో పాల్గొని ప్రసంగించారు. ప్రపంచం అంతా భారత్‌పైనే ఆశలు పెట్టుకుందని, విదేశీ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టడం పెరిగిందని అన్నారు. పెట్టుబడులు కేవలం పెరగడమే కాకుండా రెట్టింపు అవుతున్నాయని చెప్పారు.
ఈ సందర్భంగా భారత్-జపాన్ భాగస్వామ్యాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. భారత్ అభివృద్ధిలో జపాన్ కీలక భాగస్వామి అని అన్నారు. ‘ప్రపంచం కేవలం భారతదేశాన్ని మాత్రమే చూడటం లేదు. భారత్‌పై ఆశలు పెట్టుకుంది. భారత అభివృద్ధి ప్రయాణంలో జపాన్ కీలక పాత్ర పోషించింది. మెట్రో రైళ్ల నుంచి సెమీకండక్టర్లు, స్టార్టప్‌లు.. ఇలా అనేక రంగాల్లో తోడ్పాటు అందించింది. జపాన్ సంస్థలు భారత్‌లో 40 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టాయి’ అని ప్రధాని చెప్పుకొచ్చారు. భారత్‌లో ఆర్థిక, రాజకీయ స్థిరత్వం నెలకొందని ఈ సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు.
భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అని, త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని వివరించారు. ప్రభుత్వ పరంగా పారదర్శకమైన విధానాలను అవలంభిస్తున్నట్లు చెప్పారు. భారత్ మార్కెట్లు భారీ రాబడిని అందిస్తున్నాయని, తమకు బలమైన బ్యాంకింగ్ రంగం, 700 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయని వివరించారు. అణుశక్తి, గ్రీన్ ఎనర్జీ, ఆటోసెక్టార్‌లో రెండు దేశాలు మరింత కలిసికట్టుగా పనిచేయాలని మోదీ సూచించారు.
Also Read..
Fighter Jet Crashes | కూలిన ఫైటర్ జెట్.. ఎగసిపడ్డ మంటలు.. షాకింగ్ వీడియో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

