Sea Drone Attack | రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం (Russia-Ukraine War) ఆపేందుకు అగ్రరాజ్యం అమెరికా రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఇరుదేశాల మధ్య శాంతి ఒప్పందం దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే, యుద్ధం ఆపేందుకు ఓవైపు చర్చలు జరుగుతుండగా.. మరోవైపు రెండు దేశాలూ ఒకరిపై ఒకరు డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసుకుంటున్నాయి. నిన్న ఉక్రెయిన్ (Ukraine)పై రష్యా (Russia) భీకర దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దాదాపు 598 డ్రోన్లు, 31 క్షిపణులను రాజధాని కీవ్‌పై ప్రయోగించింది. ఈ దాడిలో 17 మంది మరణించగా.. 48 మంది గాయపడ్డారు. ఇక ఇవాళ కూడా మాస్కో డ్రోన్లతో విరుచుకపడింది.
ఉక్రెయిన్ నావికా దళానికి చెందిన అతి పెద్ద నిఘా నౌకను (Ukraines Largest Naval Ship) రష్యా ధ్వంసం చేసింది. ఉక్రెయిన్‌లోని ఒడెస్సా ప్రాంతంలో గల దనుబె నదిలో నిఘా నౌక సింఫెరోపోల్ (Simferopol) మోహరించి ఉండగా.. రష్యా దానిపై దాడి (Drone Attack) చేసింది. సముద్ర డ్రోన్ (Sea Drone) సాయంతో అతిపెద్ద నౌకను విజయవంతంగా కూల్చివేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ దాడిని ఉక్రెయిన్ కూడా ధ్రువీకరించింది. ఘటనలో నౌకలోని ఓ సిబ్బంది మరణించగా.. మరికొందరు గాయపడినట్లు తెలిపింది. ఉక్రెయిన్ నావికాదళానికి చెందిన అతి పెద్ద నిఘా నౌక సింఫెరోపోల్ దశాబ్ద కాలంగా ఉక్రెయిన్ నేవీకి సేవలు అందిస్తోంది.
Unbelievable
An unmanned Russian boat rammed and sank Ukraine’s reconnaissance ship Simferopol. pic.twitter.com/MvQ1MZyNKG
— War & Gore (@Goreunit) August 28, 2025
Also Read..
JD Vance | అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తా.. జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు
Japan | ప్రధాని మోదీ పర్యటన వేళ.. అమెరికాకు షాకిచ్చిన జపాన్