Lindsey Graham | అమెరికా సెనేటర్ (US Senator) లిండ్సే గ్రాహం ( Lindsey Graham) సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యాకు మద్దతిచ్చి భారత్ మూల్యం చెల్లించుకుంటోందని వ్యాఖ్యానించారు. మిగతా దేశాలు కూడా త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకుంటాయని హెచ్చరించారు.
రష్యా నుంచి డిస్కౌంట్‌పై చమురు కొనుగోలు (Russian oil) చేస్తోందన్న కారణంతో భారత్‌పై అమెరికా 50 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకే భారత్‌పై సెకండరీ టారిఫ్‌లు విధించినట్లు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇటీవలే తెలిపారు. ఈ వ్యవహారంపై అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం తాజాగా స్పందించారు. ఈ మేరకు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలకు కీలక హెచ్చరికలు చేశారు.
భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలు రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేసి ఉక్రెయిన్‌పై మాస్కో యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయని విమర్శించారు. ఈ చర్యల కారణంగా అమాయకపు ప్రజలు, పిల్లలు మరణిస్తుంటే.. మీరు ఎలా ఫీలవుతున్నారు..? అంటూ ప్రశ్నించారు. రష్యా చమురు కొనుగోలు ఫలితంగా భారత్ ఇప్పటికే మూల్యం చెల్లించుకుంటోందని వ్యాఖ్యానించారు. మాస్కోతో వ్యాపారం కొనసాగిస్తే ఇతర దేశాలకు కూడా త్వరలోనే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయని లిండ్సే గ్రాహం తీవ్రంగా హెచ్చరించారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. కీవ్‌పై రష్యా (Russia) క్షిపణి దాడిలో 23 మంది ఉక్రెయిన్ వాసులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో లిండ్సే వ్యాఖ్యలు రావడం గమనార్హం.
Also Read..
JD Vance | అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తా.. జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు
Japan | ప్రధాని మోదీ పర్యటన వేళ.. అమెరికాకు షాకిచ్చిన జపాన్