Driver | రాజస్థాన్ (Rajasthan)లో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. డ్రైవింగ్ సమయంలో డ్రైవర్ (Driver) అనారోగ్యానికి గురికావడంతో.. ముందు జాగ్రత్తగా స్టీరింగ్ కో డ్రైవర్‌కు ఇచ్చి ప్రయాణికులను కాపాడాడు. అనంతరం బస్సులోనే ప్రాణాలు వదిలాడు.
వివరాల్లోకి వెళితే.. సతీశ్ రావు అనే వ్యక్తి ఇండోర్ నుంచి జోధ్‌పూర్ ( Indore to Jodhpur) వెళ్లే ప్రైవేట్ బస్సును (Bus Driver) నడుపుతున్నాడు. అయితే, మార్గం మధ్యలో అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ముందు జాగ్రత్తగా కో డ్రైవర్‌ను డ్రైవింగ్ చేయమని చెప్పాడు. డ్రైవింగ్ సీట్లో నుంచి పక్కకు జరిగి కూర్చున్నాడు. ఇంతలో హెల్పర్ సమీపంలోని మెడికల్ స్టోర్ వద్దకు వెళ్లగా.. అది మూసివేసి ఉంది. వేరేచోటుకు వెళ్తున్న క్రమంలోనే సతీశ్ రావు కూర్చున్న చోటే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో బస్సులోని వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే, చివరి నిమిషంలో స్టీరింగ్ హెల్పర్‌కు ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా సేఫ్‌గా ఉన్నారు. అయితే, అతడు గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధరించారు.
Also Read..
Pregnant Women | వరకట్న వేధింపులకు మరో గర్భిణి బలి.. ఫ్యాన్‌కు ఉరేసుకొని టెకీ మృతి.. భర్త అరెస్ట్
Urjit Patel: ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నియామకం
Vaishno Devi Board: ఆరోపణలను కొట్టిపారేసిన వైష్ణవోదేవి బోర్డు