Pregnant Women | అధిక కట్నం కోసం ఇటీవలే ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఓ గర్భిణిని అత్తింటివాళ్లు నిప్పటించి హత్య చేసిన ఘటన మరవకముందే.. వరకట్న వేధింపులకు (dowry harassment) మరో గర్భిణి బలైంది (Pregnant Women). బెంగళూరు Bengaluru)లో శిల్ప అనే టెకీ అనుమానాస్పద స్థితిలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని తనువు చాలించింది.
27 ఏండ్ల శిల్ప అనే యువతికి ప్రవీణ్ అనే వ్యక్తితో మూడేండ్ల క్రితం వివాహమైంది. వారికి ఏడాదిన్నర వయసు గల చిన్నారి ఉంది. ప్రస్తుతం శిల్ప ఐదు నెలల గర్భిణి. ఆమె తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. అయితే, గర్భిని తల్లిదండ్రులు మాత్రం అధిక కట్నం కోసం అత్తింటి వాళ్లే తమ బిడ్డను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తోందని ఆరోపిస్తున్నారు.
పెళ్లి సమయంలో ప్రవీణ్ కుటుంబం భారీగా కట్నం డిమాండ్ చేసిందని శిల్ప ఫ్యామిలీ తెలిపింది. రూ.15 లక్షల నగదు, 150 గ్రాముల బంగారంతోపాటూ ఇంట్లోకి పలు వస్తువులను కూడా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు చెప్పింది. దీంతో పెళ్లి సమయంలో ఆ డిమాండ్లను నెరవేర్చినట్లు వివరించింది. పెళ్లైన తర్వాత అధిక కట్నం కోసం అత్తింటివాళ్లు వేధిస్తున్నట్లు శిల్ప కుటుంబం ఆరోపించింది. పెళ్లి సమయంలో తమ ఇంటిని అమ్మి రూ.40 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసినట్లు తెలిపింది. పెళ్లి సమయంలో వారు అడిగినదానికంటే 10 గ్రాములు ఎక్కువ అంటే 160 గ్రాముల బంగారు ఆభరణాలు కూడా ఇచ్చినట్లు పేర్కొంది.
పెళ్లి సమయంలో ప్రవీణ్ బీఈ, ఎంటెక్ గ్రాడ్యుయేట్ అని చెప్పి నమ్మించాడని, కానీ గత రెండేళ్లుగా పానీ పూరీ అమ్ముతున్నాడని వాపోయింది. శిల్ప ఆత్మహత్యపై వారు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఉరివేసుకున్న గదిలో ఓ కుర్చీ కూడా లేదని, ఫ్యాన్ కూడా చాలా ఎత్తులో ఉందన్నారు. తలుపు విరిగిన సంకేతాలు కూడా లేవని పేర్కొన్నారు. అక్కడ వాతావరణం చూస్తే భర్తే శిల్పను హతమార్చి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రవీణ్‌ను అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read..
JD Vance | అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తా.. జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు
Fighter Jet Crashes | కూలిన ఫైటర్ జెట్.. ఎగసిపడ్డ మంటలు.. షాకింగ్ వీడియో