Urjit Patel: ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నియామకం
Urjit Patel : ఆర్బీఐ మాజీ గవర్నర్, ఆర్థికవేత్త ఉర్జిత్ పటేల్‌ను అంతర్జాతీయ ద్రవ్య నిధికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించారు. కేంద్ర క్యాబినెట్‌కు చెందిన అపాయింట్స్ కమిటీ ఈ నియామకం కోసం అనుమతి జారీ చేసింది. మూడేళ్ల పాటు ఆయన ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చేయనున్నారు.
న్యూఢిల్లీ: ఆర్బీఐ మాజీ గవర్నర్, ఆర్థికవేత్త ఉర్జిత్ పటేల్(Urjit Patel)ను అంతర్జాతీయ ద్రవ్య నిధికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించారు. కేంద్ర క్యాబినెట్‌కు చెందిన అపాయింట్స్ కమిటీ దీనికి అనుమతి ఇచ్చింది. మూడేళ్ల పాటు ఆయన ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చేయనున్నారు. 2016 నుంచి 2018 వరకు ఆర్బీఐ గవర్న్‌గా ఉర్జిత్ పటేల్ బాధ్యతలు నిర్వర్తించారు. ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో ఆయన భారత్ తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఐఎంఎఫ్ విధాన పరమైన నిర్ణయాలను ఎగ్జిక్యూటివ్ బోర్డు చూసుకుంటుంది.
అయితే ఆర్బీఐ గవర్నర్‌గా తన పదవీకాలం ముగియక ముందే ఉర్జిత్ పటేల్ రిలీజైన చేశారు. 2016, సెప్టెంబర్ 4వ తేదీన ఆయన ఆర్బీఐ 24వ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఐఎంఎఫ్‌కు సేవలు అందించడం ఉర్జిత్ పటేల్‌కు ఇది రెండోసారి. 1996-1997 మధ్య ఆయన ఐఎంఎఫ్ తరపున ఆర్బీఐకి పనిచేశారు. రుణాలు, బ్యాంకింగ్ రంగ సంస్కరణలు, పెన్షన్ నిధుల అప్డేట్, విదేశీ మార్కెట్ గురించి ఆయన పలు సలహాలు, సూచనలు చేశారు. 1998 నుంచి 2001 వరకు ఆర్థికశాఖలోని ఆర్థిక వ్యవహాల శాఖకు కన్సల్టెంట్‌గా చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

