అమరావతి : ఏపీలోని పశ్చిమ గోదావరి ( West Godavari ) జిల్లా ఇరగవరం మండలం ఐతంపూడిలాకుల వద్ద విషాదం( Tragedy ) చోటు చేసుకుంది.ఓగిడి నుంచి తూర్పుగోదావరి జిల్లాలోని పెరవలిలో పెళ్లికి వెళ్లి వస్తుండగా నరసాపురం ప్రమాదవశాత్తు కారు కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు ( Engineering Students ) గల్లంతయ్యారు.
వీరిలో లక్ష్మీభాను (18), నాగిరెడ్డి (18), వీరమల్కులసాయి (19) మృతదేహాలు లభ్యం కాగా మరో ఇద్దరు రాజారాం ( 17 ) , సాయిసూర్య(19) గల్లంతయ్యారు. వీరి కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. ఈ ప్రమాదం నుంచి ఒక యువకుడు సురక్షితంగా బయటపడ్డాడు. ఘటనపై ఏపీ మంత్రులు కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుబూతి తెలిపారు. గల్లంతైన ఇద్దరి కోసం గాలింపు ముమ్మరం చేయాలని జిల్లా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
మరో ఘటనలో ఇద్దరు ..
పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం వేండ్ర కాలువలో ఈతకు దిగి మరో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. మృతులు భీమవరం, పార్వతీపురం మండల వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు.