Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి యూపీ కోర్టులో భారీ ఊరట లభించింది. 2018లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై చేసిన అభ్యంతర వ్యాఖ్యలకు గానూ పరువు నష్టం కేసు (defamation case)లో సుల్తాన్ పూర్ కోర్టు (Sultanpur Court) రాహుల్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
2018 లో బెంగళూరు(Bangalore) లో జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) పై రాహుల్ గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ(BJP) నాయకుడు విజయ్ మిశ్రా పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఓ హత్య కేసులో అమిత్ షా హయాంలో బీజేపీ ప్రమేయం ఉందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. ఈ కేసుపై సుల్తాన్ పూర్ కోర్టు (Sultanpur Court) మంగళవారం విచారణ జరిపింది. కేసు విచారణకు నేడు రాహుల్ కూడా హాజరయ్యారు. ఈ మేరకు ఇరుపక్ష వాదనలు విన్న న్యాయస్థానం.. రాహుల్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
Also Read..
Rahul Gandhi | న్యాయ్ యాత్రలో ఘర్షణ.. రాహుల్‌కు సమన్లు జారీ చేయనున్న అస్సోం సీఐడీ..!
Coaching Student | కోటాలో అదృశ్యమైన విద్యార్థి మృతదేహం లభ్యం
Smriti Irani: వయనాడ్ వదిలేయ్.. అమేథీలో పోటీ చేయ్.. రాహుల్ గాంధీకి స్మృతి ఇరానీ సవాల్