న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి .. సవాల్ విసిరారు స్మృతి ఇరానీ(Smriti Irani). వయనాడ్ నియోజకవర్గాన్ని వదిలేసి.. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కేవలం అమేథీలోనే రాహుల్ పోటీ చేయాలని ఆమె అన్నారు. ఒకవేళ రాహుల్ కాన్ఫడెంట్గా ఉంటే, వయనాడ్‌లో ఆయన పోటీ చేయాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ సీటుపై ఆయన అమేథీ నుంచి మాత్రమే పోటీ చేయాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సవాల్ విసిరారు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యలో ఆమె ఈ ఛాలెంజ్ చేశారు.
యూపీలోని అమేథీ సీటు నుంచి గతంలో స్మృతి ఇరానీపై రాహుల్ గాంధీ ఓడిపోయారు. 2019 జనరల్ ఎలక్షన్స్‌లో 50 వేల ఓట్ల తేడాతో స్మృతి ఇరానీ గెలుపొందారు. అయితే ఆ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ సీటు నుంచి రాహుల్ విజయం సాధించారు. ఆ స్థానం నుంచి ఆయన 4.3 లక్షల ఓట్ల తేడాతో నెగ్గారు.
గతంలో అమేథీ స్థానం నుంచి రాహుల్ గాంధీ మూడు సార్లు విజయం సాధించారు. 2004 నుంచి ఆయన ఆ స్థానం నుంచి గెలిచారు. కానీ 2019లో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. అయితే రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్న విషయం ఇంకా తెలియలేదు. అమేథీ నుంచా లేక వయనాడ్ నుంచి రాహుల్ పోటీ చేస్తారా లేదా అన్న క్లారిటీ లేదు.