Coaching Student | రాజస్థాన్ కోటాలో (Kota ) వారం రోజుల క్రితం అదృశ్యమైన (Student Missing) రచిత్ సోంధ్య (16) అనే విద్యార్థి కథ విషాదాంతమైంది. అతడి మృతదేహాన్ని పోలీసులు తాజాగా గుర్తించారు. రాజస్థాన్‌లోని చంబల్ లోయ (Chambal Valley)లో వారం రోజులుగా తీవ్ర గాలింపు చేపట్టగా.. సోమవారం విద్యార్థి మృతదేహాన్ని కనుగొన్నారు. రచిత్ బాడీని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
కాగా, రచిత్ జేఈఈ కోసం మధ్యప్రదేశ్ నుంచి వచ్చి, ఇక్కడ శిక్షణ పొందుతున్నాడు. ఫిబ్రవరి 11వ తేదీన గరడియా మహదేవ్ దేవాలయానికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ రచిత్ మొబైల్ ఫోన్, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడు ఆలయం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి ప్రవేశించడం సెక్యూరిటీ కెమెరా ఫుటేజీలో కనిపించింది. దీంతో ఆ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఆ ప్రాంతంలో తీవ్రంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే నిన్న రచిత్ మృతదేహాన్ని కనుగొని స్వాధీనం చేసుకున్నారు.
Also Read..
Mark Butcher | ఆల్‌రౌండర్‌గా బెస్ట్ బ్యాటర్.. భారీ మూల్యం చెల్లించుకున్న ఇంగ్లండ్
Bull stops play | క్రికెట్ మ్యాచ్‌ను ఆపేసిన ఎద్దు.. తలోదిక్కు పరుగెత్తిన కుర్రాళ్లు.. వీడియో
IITH | తెలంగాణకు తలమానికం ఐఐటీహెచ్.. నేడు జాతికి అంకితమివ్వనున్న ప్రధాని మోదీ