Mark Butcher | ఆల్‌రౌండర్‌గా బెస్ట్ బ్యాటర్.. భారీ మూల్యం చెల్లించుకున్న ఇంగ్లండ్
Mark Butcher : భారత పర్యటనలో ఇంగ్లండ్(England) జట్టు మిడిలార్డర్ వైఫల్యంతో వరుస ఓటములను చవిచూసింది. ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు భారత పిచ్‌లపై పరుగులు చేయకుండా నిరాశపరుస్తున్నారు. మరీ ముఖ్యంగా ఫ్యాబ్ 4లో ఒకడైన జో రూట్(Joe Root) వైఫల్యం అందర్నీ...
Mark Butcher : భారత పర్యటనలో ఇంగ్లండ్(England) జట్టు మిడిలార్డర్ వైఫల్యంతో వరుస ఓటములను చవిచూసింది. ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు భారత పిచ్‌లపై పరుగులు చేయకుండా నిరాశపరుస్తున్నారు. మరీ ముఖ్యంగా ఫ్యాబ్ 4లో ఒకడైన జో రూట్(Joe Root) వైఫల్యం అందర్నీ అవాక్కయ్యేలా చేస్తోంది. ప్రపంచంలోని మేటి టెస్టు బ్యాటర్ అయిన రూట్ మూడు టెస్టుల్లో ఒక్కటంటే ఒక్క హాఫ్ సెంచరీ కూడా కొట్టలేకపోయాడు. దీనికి కారణం అతడిపై ఆల్‌రౌండర్‌గా భారం మోపడమే అని మాజీలు అభిప్రాయపడుతున్నారు.
రాజ్‌కోట్ టెస్టులో ఇంగ్లీష్ జట్టు భారీ ఓటమి అనంతరం అందరూ రూట్‌నే పాయింట్ అవుట్ చేశారు. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మార్క్ బట్చర్(Mark Butcher) స్టోక్స్ సేన పరాజయంపై స్పందిస్తూ… ఇంగ్లండ్ జట్టు తమ అత్యుత్తమ బ్యాటర్‌ను ఆల్‌రౌండర్‌గా మార్చేసి భారీ మూల్యం చెల్లించిందని అన్నాడు.
“In my eyes, that’s the same as playing a drive and nicking off to second slip” #INDvENG https://t.co/n5J5WzzHxR
— ESPNcricinfo (@ESPNcricinfo) February 17, 2024
రూట్‌ను నిఖార్సైన ఆల్‌రౌండర్‌గా ఇంగ్లండ్ వాడుకుంటోంది. అప్పుడు అతడు బ్యాటుతో పరుగులు చేయకపోవడం నన్ను పెద్దగా ఆశ్చర్యపరచడం లేదు. కానీ, బ్యాటర్‌గా రూట్ సేవల్ని మిస్ అవుతోంది. ప్రధాన స్పిన్నర్లా అతడితో ఎక్కువ ఓవర్లు వేయించి స్టోక్స్ సేన భారీ మూల్యం చెల్లించుకుంది అని బట్చర్ అన్నాడు. భారత పర్యటనలో మూడు టెస్టుల్లో రూట్ 77 పరుగులు మాత్రమే చేశాడు. కానీ, పార్ట్ టైమ్ బౌలర్‌గా ఏకంగా 107 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఉప్పల్ టెస్టులో 5 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Jadeja has Root’s wicket and England are 50-5! #INDvENG
— ESPNcricinfo (@ESPNcricinfo) February 18, 2024
దాంతో, వైజాగ్, రాజ్‌కోట్ టెస్టులోనూ స్టోక్స్.. రూట్‌తో బౌలింగ్ చేయించాడు. అయితే.. ఒకటి రెండు వికెట్లు తీసినా బ్యాటర్‌గా మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లకు ప్రయత్నించి వికెట్ పారేసుకున్నాడు. ఇంగ్లండ్ జట్టు వరుస ఓటముల్లో రూట్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. సుదీర్ఘ ఫార్మాట్లో 30 సెంచరీలు బాదిన అతడు మిగతా రెండు టెస్టుల్లో లయ అందుకోవాలని ఇంగ్లండ్ కోరుకుంటోంది. రాంచీలో ఫిబ్రవరి 23న నాలుగో టెస్టు జరుగనుంది.
ఇవి కూడా చదవండి
- Smriti Irani: వయనాడ్ వదిలేయ్.. అమేథీలో పోటీ చేయ్.. రాహుల్ గాంధీకి స్మృతి ఇరానీ సవాల్
- Bull stops play | క్రికెట్ మ్యాచ్‌ను ఆపేసిన ఎద్దు.. తలోదిక్కు పరుగెత్తిన కుర్రాళ్లు.. వీడియో
- ORR | ఓఆర్ఆర్పై నుంచి కిందపడిన కారు.. ఇద్దరు యువకులు మృతి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

