Punjab govt : ఉత్తరాది రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు (Heavy rains) తీవ్ర నష్టం మిగిల్చాయి. ముఖ్యంగా పంజాబ్ (Punjab) లో ఎడతెరపి లేకుండా వర్షాలు పడటంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. దాంతో పెట్టిన పెట్టుబడి, చేసిన కష్టం నీటి పాలైందని రైతులు తలలు పట్టుకున్నారు.
దాంతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీట మునిగిన ప్రతి ఎకరా పంటకు రూ.20 వేల చొప్పున పరిహారం చెల్లించాలని నిర్ణయించింది. పంజాబ్ సీఎం కార్యాలయం సోమవారం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది.