Shashi Tharoor | ట్రంప్ తీరుతో కలిగిన బాధను, అవమానాన్ని మర్చిపోలేం : శశిథరూర్
Shashi Tharoor | అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత్ (India) తో సంబంధాలపై సానుకూలంగా మాట్లాడటం, ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) వెంటనే స్పందించడంపై కాంగ్రెస్ ఎంపీ (Congress MP) శశిథరూర్ (Shashi Tharoor) కామెంట్స్ చేశారు.
Shashi Tharoor : అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత్ (India) తో సంబంధాలపై సానుకూలంగా మాట్లాడటం, ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) వెంటనే స్పందించడంపై కాంగ్రెస్ ఎంపీ (Congress MP) శశిథరూర్ (Shashi Tharoor) కామెంట్స్ చేశారు. ప్రధాని మోదీ త్వరగానే స్పందించినప్పటికీ రెండు దేశాల ప్రభుత్వాలు, దౌత్యవేత్తలు చేయాల్సిన తీవ్రమైన మరమ్మతులు మిగిలే ఉన్నాయని అన్నారు.
భారత్ విషయంలో ట్రంప్ తన స్వరాన్ని తగ్గించడాన్ని జాగ్రత్తగా స్వాగతిస్తున్నామని థరూర్ చెప్పారు. భారతీయులు ఎదుర్కొన్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుంటే ట్రంప్ వల్ల కలిగిన బాధను, అవమానాన్ని త్వరగా మర్చిపోలేమని అన్నారు. అధ్యక్షుడు, ఆయన సిబ్బంది చేసిన అవమానాలు చాలా ఉన్నాయని తెలిపారు. ట్రంప్ పాదరస స్వభావం కలిగిన వ్యక్తని థరూర్ అభివర్ణించారు.
‘ప్రధాని నరేంద్రమోదీ చాలా త్వరగా స్పందించారు. సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం అనే ప్రాథమిక సంబంధం గురించి విదేశాంగ మంత్రి కూడా నొక్కి చెప్పారు. అది ఇప్పటికీ అలాగే ఉంది. అదే మనం ఇవ్వాల్సిన ముఖ్యమైన సందేశం. రెండు దేశాల ప్రభుత్వాలు, దౌత్యవేత్తలు కలిసి పరిష్కరించుకోవాల్సిన తీవ్రమైన అంశాలు కొన్ని ఉన్నాయని నేను భావిస్తున్నాను. ట్రంప్ కొత్త స్వరాన్ని జాగ్రత్తగా స్వాగతిస్తున్నా. భారతీయులు ఎదుర్కొన్న వాస్తవ పరిణామాలు చాలా ఉన్నాయి. కాబట్టి అంత త్వరగా క్షమించలేరు. ఆ పరిణామాలను అధిగమించాల్సి ఉంది’ అని థరూర్ మాట్లాడారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

