Dussehra Holidays | రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు దసరా సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సెప్టెంబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. అక్టోబర్ 4వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.
ఇక జూనియర్ కాలేజీల విషయానికొస్తే సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 25వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. జూనియర్ కాలేజీలు అక్టోబర్ 26వ తేదీన పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.