Maha Kumbh | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు (Maha Kumbh) భక్తులు పోటెత్తుతున్నారు. త్రివేణీ సంగమంలో స్నానాలు చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అంచనాలకు మించి తరలివస్తున్నారు. ఈ మహాకుంభమేళాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కూడా పాల్గొననున్నట్లు తెలిసింది. వచ్చే నెల అంటే ఫిబ్రవరి 5వ తేదీన ప్రధాని ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సైతం మహాకుంభ్‌ను సందర్శించే అవకాశం ఉందని తెలిసింది. ఫిబ్రవరి 10వ తేదీన రాష్ట్రపతి ముర్ము మహాకుంభమేళాకు వెళ్లనున్నట్లు సమాచారం.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ఈనెల 27న మహాకుంభమేళాకు హాజరుకానున్నట్లు తెలిసింది. త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించి గంగాపూజ నిర్వహించనున్నారు. అనంతరం అక్కడి అధికారులతో సమావేశాలు నిర్వహించనున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి. ఇక ఫిబ్రవరి 1వ తేదీన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ సైతం ప్రయాగ్‌రాజ్ వెళ్లనున్నారు. ప్రముఖుల పర్యటన నేపథ్యంలో అధికారులు నగరంలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. కీలక కూడళ్లు, కార్యక్రమాల వేదికలపై నిఘా పెంచారు.
Also Read..
Maha Kumbh | 8 రోజుల్లో 9 కోట్ల మంది పుణ్యస్నానాలు.. కుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు
Flying Past rehearsals | గణతంత్ర వేడుకల ముందు ఢిల్లీలో ఫ్లయింగ్ పాస్ట్ రిహార్సల్స్.. Videos
Badrinath Kedarnath Temple Committee: తెలంగాణ ట్రస్టుకు బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ నోటీసులు