Maha Kumbh | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు (Maha Kumbh) భక్తులు పోటెత్తుతున్నారు. త్రివేణీ సంగమంలో స్నానాలు చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అంచనాలకు మించి తరలివస్తున్నారు. ఈ కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ అంటే ఎనిమిది రోజుల వ్యవధిలో దాదాపు 9 కోట్ల మంది త్రివేణీ సంగమం (Triveni Sangam)లో పుణ్యస్నానాలు ఆచరించారు.
ఈనెల 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ 8.81 కోట్ల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించి పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు తాజాగా వెల్లడించారు. తొలిరోజైన సోమవారం 1.65 కోట్ల మందికిపైగా పుష్య పూర్ణిమ స్నానాలు ఆచరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండో రోజైన మకర సంక్రాంతి రోజునే (మంగళవారం) 3.5 కోట్ల మందికిపైగా వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మూడో రోజు కూడా కోటి మంది దాకా భక్తులు త్రివేణి సంగమానికి వచ్చారు.
#WATCH | Uttar Pradesh | Devotees continue to participate in the World’s largest religious congregation – #MahaKumbh2025, in Prayagraj
More than 8.81 crore devotees have taken holy dip in Triveni Sangam, so far pic.twitter.com/Mndm6rudwO
— ANI (@ANI) January 21, 2025
ఇక నిన్న అంటే 20వ తేదీ (సోమవారం)న 54.96 లక్షల మంది భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు. ఇక అత్యంత కీలకమైన మౌనీ అమావాస్య అయిన జనవరి 29న రానుంది. ఆ రోజు ఏకంగా 10 కోట్ల మంది కంటే అధికంగా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆదేశించారు.
సంక్రాంతి రోజున ప్రారంభమైన (జనవరి 13) మహా కుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రితో ముగుస్తుంది. 45 రోజులపాటు సాగనున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యే భక్తుల సంఖ్య 50 కోట్లు దాటుతుందని యూపీ సర్కార్ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో కోట్లాది మందికి తగిన రీతిలో ఏర్పాటు చేసింది యూపీ ప్రభుత్వం. సుమారు లక్షా 60 వేల టెంట్లను ఏర్పాటు చేశారు. లక్షా 50 వేల టెయిలెట్లను నిర్మించారు. దాదాపు 15వేల మంది శానిటేసన్ వర్కర్లు పనిచేయనున్నారు. 1250 కిలోమీటర్ల దూరం పైప్‌లైన్ వేశారు. 67 వేల ఎల్ఈడీ లైట్లు, రెండు వేల సోలార్ లైట్లు, మూడు లక్షల వృక్షాలను ఏర్పాటు చేశారు.
హెల్త్‌కేర్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వంద బెడ్లతో సెంట్రల్ ఆస్పత్రిని సెటప్ చేశారు. రెండు 20 పడకల సబ్ సెంటర్ ఆస్పత్రులను, 25 ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక కుంభమేళా ప్రాంతంలో 125 అంబులెన్సులు అందుబాటో ఉంటాయి. రాయ్‌బరేలీలోని ఎయిమ్స్ వైద్యులు నిత్యం అందుబాటులో ఉంటారు. మతపరమైన అకాడాలకు కూడా ప్రత్యేక టెంట్లను కేటాయించారు.
Also Read..
Badrinath Kedarnath Temple Committee: తెలంగాణ ట్రస్టుకు బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ నోటీసులు
Telecom Services | నో సిగ్నల్ సమస్య ఉండదిక.. త్వరలో అందుబాటులోకి ఇంట్రా సర్కిల్ రోమింగ్
Cab Fare | లో బ్యాటరీ ఉంటే చార్జీల మోతే.. క్యాబ్ అగ్రిగేటర్ల మాయాజాలం!