Telecom Services | నో సిగ్నల్ సమస్య ఉండదిక.. త్వరలో అందుబాటులోకి ఇంట్రా సర్కిల్ రోమింగ్
గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు వెళ్లినప్పుడు మొబైల్ సిగ్నల్ లేకపోవడం చాలా ఇబ్బంది పెడుతుంది. మనం వాడే నెట్వర్క్ కాకు ండా వేరే నెట్వర్క్ సిగ్నల్ ఉన్నా మనం వినియోగించుకోలేని పరిస్థితి ఉంటుంది.
- అందుబాటులోకి ఇంట్రా సర్కిల్ రోమింగ్
- ప్రభుత్వ నిధులతో 27 వేల టవర్లు
- సంయుక్తంగా వాడుకోనున్న టెలికం సంస్థలు
Telecom Services | న్యూఢిల్లీ, జనవరి 20: గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు వెళ్లినప్పుడు మొబైల్ సిగ్నల్ లేకపోవడం చాలా ఇబ్బంది పెడుతుంది. మనం వాడే నెట్వర్క్ కాకు ండా వేరే నెట్వర్క్ సిగ్నల్ ఉన్నా మనం వినియోగించుకోలేని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది. ఇందుకు వీలు కల్పించే ఇంట్రా సర్కిల్ రోమింగ్(ఐసీఆర్) సర్వీస్‌ను కేంద్ర టెలికం శాఖ జనవరి 17న ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు ప్రభుత్వం డిజిటల్ భారత్ నిధి(డీబీఎన్) అనే కార్యక్రమాన్ని చేపట్టింది.
ఇందులో భాగంగా 35 వేల గ్రామాలకు మొబైల్ నెట్వర్క్ ఉండేలా 27 వేల మొబైల్ టవర్లను ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటివరకు డీబీఎన్ నిధులతో ఏ కంపెనీ అయితే టవర్‌ను ఏర్పాటు చేస్తుందో ఆ కంపెనీ వినియోగదారులకు మాత్రమే సిగ్నల్ అందేది. ఇప్పుడు ప్రారంభించిన ఐసీఆర్ ద్వారా డీబీఎన్ నిధులతో ఏర్పాటైన టవర్లను బీఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్ సంస్థలు సంయుక్తంగా వినియోగించుకుంటాయి. తద్వారా ఈ కంపెనీల వినియోగదారులందరికీ మారుమూల ప్రాంతాల్లోనూ 4జీ మొబైల్ నెట్వర్క్ అందుతుంది. డీబీఎన్ టవర్ల పరిధిలో మనం వాడే నెట్వర్క్ సిగ్నల్ లేకపోతే మన ఫోన్ ఆటోమెటిక్‌గా అక్కడ ఉండే నెట్‌వర్క్‌కు మారిపోయే సదుపాయం కూడా రానున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

