గోపేశ్వర్: ఉత్తరాఖండ్‌కు చెందిన బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ(Badrinath Kedarnath Temple Committee).. తెలంగాణకు చెందిన ఓ ట్రస్టుకు నోటీసులు జారీ చేసింది. బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాలకు చెందిన నమోనాలను తెలంగాణలో నిర్మించేందుకు ఓ ట్రస్టు ప్లాన్ చేసింది. హిమాలయాల్లోని ఆ గుళ్ల నమోనాలను పునర్ సృష్టించవద్దు అని కమిటీ తన నోటీసులో పేర్కొన్నది. సోమవారమే ఆ నోటీసులు జారీ అయ్యాయి.
ఆలయ కమిటీకి చెందిన మీడియా ఆఫీసర్ హరీశ్ గౌర్ ఆ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. ఆలయ కమిటీ ప్యానల్లోని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విజయ్ ప్రసాద్ తప్లియాల్ దానిపై సంతకం చేశారు. హిమాలయ పర్వతాల్లోని బద్రీనాథ్, కేదార్నాథ్ క్షేత్రాలను భక్తులు కొన్ని శతాబ్ధాల నుంచి విజిట్ చేస్తున్నారని, అయితే ఆ ఆలయాలకు చెందిన నమోనాలను రీక్రియేట్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు కమిటీ తన నోటీసులో తెలిపింది.
రెండు వారాల్లోగా తమ నోటీసులకు స్పందించాలని బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ కోరింది. ఒకవేళ స్పందన లేని పక్షంలో.. సివిల్, క్రిమినల్ చర్యలు ఉంటాయని ఆలయ కమిటీ తన నోటీసులో పేర్కొన్నది.