President Droupadi Murmu | రాష్ట గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతికి నిర్దిష్ట టైమ్ లైన్ విధిస్తూ ఇటీవలే సుప్రీం కోర్టు (Supreme Court) సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీనిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) తాజాగా స్పందించారు. ఈ మేరకు రాష్ట్రపతి, గవర్నర్కు సుప్రీంకోర్టు డెడ్లైన్ పెట్టొచ్చా..? అని ప్రశ్నించారు. రాజ్యాంగంలో అలాంటి నిబంధనేదీ లేనప్పుడు కోర్టు తీర్పు ఎలా ఇచ్చిందన్నారు.
‘రాజ్యాంగంలోని రాష్ట్రపతి లేదా గవర్నర్ అధికారాలను ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు తన సొంత అధికారాలతో ఎలా భర్తీ చేయగలదు..? సుప్రీంకోర్టుకు ఉన్న ప్లీనరీ అధికారాలను రాష్ట్రాలు.. కేంద్రానికి వ్యతిరేకంగా దుర్వినియోగం చేస్తున్నాయా?’ వంటి రాజ్యాంగంలోని ఆర్టికల్ 143(1) కింద పలు ప్రశ్నలు వేసినట్లు ఇండియా టుడే నివేదించింది. ఈ ప్రశ్నలపై న్యాయస్థానం తమ అభిప్రాయాలను తెలియజేయాలని అడిగినట్లు తెలుస్తోంది.
Also Read..
Jaish-e terrorists | పుల్వామాలో ఎన్కౌంటర్.. ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతం
Massive Fire | కళాశాలలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు
Rajnath Singh | నేడు జమ్ము కశ్మీర్ పర్యటనకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్