Jaish-e terrorists | పుల్వామాలో ఎన్కౌంటర్.. ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతం
Jaish-e terrorists | జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా (Pulwama) జిల్లాలో ఇవాళ ఉదయం ఎన్కౌంటర్ చోటు చేసుకుంది.
Jaish-e terrorists | జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా (Pulwama) జిల్లాలో ఇవాళ ఉదయం ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. థ్రాల్ ప్రాంతంలోని నదిర్ గ్రామంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో జైషే మమ్మద్ ఉగ్రసంస్థకు (Jaish-e terrorists) చెందిన ముగ్గురు టెర్రరిస్ట్‌లు హతమయ్యారు.
థ్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో నదిర్ గ్రామంలో గాలింపు చేస్తుండగా.. ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులకు (Encounter) దిగారు. ఈ ఎన్కౌంటర్లో జైషే మహ్మద్ ఉగ్రముఠాకు చెందిన ఆసిఫ్ అహ్మద్ షేక్, అమిర్ నజీర్ వనీ, యవర్ అహ్మద్ భట్ హతయ్యారు.
ఇదిలా ఉండగా.. షోపియాన్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగిన 48 గంటల్లోనే థ్రాల్‌లో ఎదురుకాల్పులు జరిగాయి. మంగళవారం షోపియన్ జిల్లాలో మంగళవారం ఉదయం 8 గంటలకు ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. లష్కరే తోయిబా టాప్ కమాండర్ షాహిద్ కుట్టే, అద్నాన్ షఫీ, సహా ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. మూడో ఉగ్రవాదిని పుల్వామాకు చెందిన అహ్సాన్ ఉల్ షేక్‌గా గుర్తించారు. ఇక ఉగ్రవాదుల నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండును బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇందులో ఏకే 47 రైఫిల్స్, మ్యాగజైన్స్, గ్రెనేడ్స్ ఉన్నాయి.
Also Read..
Massive Fire | కళాశాలలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు
Rajnath Singh | నేడు జమ్ము కశ్మీర్ పర్యటనకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
Chardham Yatra | చార్ధామ్ యాత్రకు భారీ స్పందన.. 150 దేశాల నుంచి రిజిస్ట్రేషన్లు..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బాలికపై రోబో లైంగిక వేధింపులు!
యూత్ కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్ఎస్లోకి దుడ్డు ఆకాశ్
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

