Chardham Yatra | చార్ధామ్ యాత్రకు ప్రపంచం నలుమూలల నుంచి స్పందన వస్తున్నది. ఇప్పటి వరకు దాదాపు 28లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నది. 150కిపైగా దేశాల నుంచి 31,581 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో ఎక్కువ మంది అమెరికా, నేపాల్, మలేషియా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా నుంచే ఎక్కువగా పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఉత్తరాఖండ్ హిమాలయ ప్రాంతాల్లో ఉన్న కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ధామ్‌లతో పాటు హేమకుండ్ సాహిబ్ సందర్శించుకునేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నట్లుగా పర్యాటశాఖ రిజిస్ట్రేషన్ గణాంకాలు చూపిస్తున్నారు. నేపాల్ నుంచి 5,728 మంది ప్రయాణికులు రిజిస్టర్ చేసుకున్నారు. అలాగే, 150 కిపైగా దేశాల నుండి ప్రయాణికులు రిజిస్టర్ చేసుకున్నారని అధికారులు తెలిపారు.
అమెరికా నుంచి 5,864, యూకే నుంచి 1,559, మారిషస్ నుంచి 837, ఇండోనేషియా నుంచి 327, కెనడా నుంచి 888, ఆస్ట్రేలియా నుంచి 1,259 పేర్లను నమోదు చేసినట్లుగా పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ నోడల్ అధికారి యోగేంద్ర గంగ్వార్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని ప్రతి దేశం నుంచి ప్రజలు చార్ధామ్ యాత్రకు రావడానికి నమోదు చేసుకుంటున్నారని తెలిపారు. చార్ధామ్ యాత్ర ఏప్రిల్ 30న ప్రారంభమైంది. మే 14 వరకు 7.18 లక్షలకుపైగా భక్తులు చార్‌ధామ్‌ను సందర్శించారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం స్లాట్లు అందుబాటులో లేకపోవడంతో ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరుగుతోంది. హరిద్వార్, రిషికేశ్, హెర్బర్ట్‌పూర్, వికాస్‌నగర్‌లో ఒక రోజులో 18 వేలకుపైగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయన్నారు. చార్ధామ్ యాత్రలో కేదార్‌నాథ్‌ను దర్శించుకునేందుకు 11,576, బద్రీనాథ్ 9,320, గంగోత్రి 5,542, యమునోత్రి 4869, హేమకుండ్ సాహిబ్ దర్శనం కోసం 274 మంది విదేశీయులు పేర్లు నమోదు చేసుకున్నారని అధికారులు వివరించారు.