వెంటనే మెగా డీఎస్సీ వేయాలి
నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్న రేవంత్ సర్కార్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని నిరుద్యోగుల జేఏసీ హెచ్చరించింది. నోటిఫికేషన్లు ఇవ్వకుండా ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని మండిపడింది.
- నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
- కాంగ్రెస్ సర్కార్‌పై నిరుద్యోగుల ఆగ్రహం
- దిల్‌సుఖ్‌నగర్‌లో రోడ్డెక్కి.. ప్లకార్డులతో నిరసన
- రేవంత్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు
- స్పందించకుంటే ఉద్యమమేనని హెచ్చరిక
హైదరాబాద్ సిటీబ్యూరో/ఎల్బీనగర్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ ) : నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్న రేవంత్ సర్కార్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని నిరుద్యోగుల జేఏసీ హెచ్చరించింది. నోటిఫికేషన్లు ఇవ్వకుండా ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని మండిపడింది. ‘రేవంత్ డౌన్‌డౌన్’, ‘నోటిఫికేషన్లు విడుదల చేయాలి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ మంగళవారం దిల్‌సుఖ్‌నగర్‌లో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వెంటనే 30 వేల పోస్టులతో మెగా డీఎస్సీ విడుదల చేయాలని తెలంగాణ బీఈడీ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు భూక్యా కుమార్ డిమాండ్ చేశారు. గురుకుల, మోడల్ స్కూల్స్, ఏజెన్సీ డీఎస్సీ, కేజీబీవీ టీచర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత కారణంగా విద్యార్థులపై ప్రభావం పడుతున్నా పోస్టులను భర్తీచేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తున్నదని విమర్శించారు. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ఏజెన్సీ సాధన సమితి ప్రధాన కార్యదర్శి జాదవ్ సుమేశ్ మాట్లాడుతూ ఉద్యోగాలు భర్తీ చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేకపోవడం దారుణమని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

