Srikrishna Janmashtami | టోక్యోలో ఘనంగా ‘శ్రీకృష్ణ జన్మాష్టమి’.. రాధ, చిన్ని కృష్ణుడి వేషధారణతో అలరించిన చిన్నారులు..!
టోక్యో, సెప్టెంబర్ 5: జపాన్లోని తెలుగు సమాజానికి అండగా నిలుస్తున్న TAJ (Telugu Association of Japan) ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు.
టోక్యో, సెప్టెంబర్ 5: జపాన్లోని తెలుగు సమాజానికి అండగా నిలుస్తున్న TAJ (Telugu Association of Japan) ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. టోక్యోలోని ఓజిమా ప్రాంతంలో అత్యంత భక్తిశ్రద్ధలతో, భారతీయ సంస్కృతి సంప్రదాయాల వైభవాన్ని ప్రతిబింబించేలా ఈ వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమలో తెలుగు కుటుంబాలతో పాటు జపనీయులు కూడా ఉత్సాహంగా పాల్గొని, భారతీయ ఆధ్యాత్మికత, సంస్కృతి, సంప్రదాయాలను ఆసక్తిగా వీక్షించారు.
శ్రీకృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకుని తాజ్ ఆధ్యర్యంలో ప్రత్యేక పూజలు, భజనలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా “ఎక్కడ ఉన్నా మన సంస్కృతి మనతోనే” అని తెలుగు కుటుంబాలు చాటాయి. చిన్నారులు శ్రీకృష్ణుడు, రాధ వేషధారణలో పాల్గొని అందరినీ అలరించారు. జపాన్లోని తెలుగు కుటుంబాలు తమ పిల్లలకు భారతీయ సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలను పరిచయం చేస్తూనే.. స్థానికులతో సాంస్కృతిక అనుబంధాలను పెంపొందించేలా కార్యక్రమాన్ని నిర్వహించారు.

భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న టోక్యోలో తెలుగు సంస్కృతి, భారతీయ సంప్రదాయాలు, జపాన్ స్థానికుల భాగస్వామ్యం, భక్తి, సమాజ ఐక్యత కలగలిసి వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబాలు, చిన్నారులు, TAJ సభ్యులు, జపాన్ స్థానికులు పరస్పరం శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం అందరికీ ప్రసాద వితరణ నిర్వహించారు.

జపాన్లో భారతీయ, తెలుగు సంస్కృతిని కొనసాగిస్తూ.. జపాన్ సమాజంతో స్నేహపూర్వక సాంస్కృతిక వారథిని నిర్మించడంలో TAJ కీలక పాత్ర పోషిస్తోందని నిర్వాహకులు తెలిపారు. భారతీయులు, జపనీయులు కలిసి శ్రీకృష్ణ జన్మాష్టమిలో పాల్గొనడం రెండు దేశాల మధ్య స్నేహం, సాంస్కృతికంగా పరస్పర అవగాహనకు ప్రతీకగా నిలిచింది.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
- Tags
- Indian culture
- Japan
- ojima
- radha
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

