Sree Vishnu | కంటెంట్‌ను నమ్మి సినిమాలు చేసే యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు. ఈ టాలెంటెడ్ యాక్టర్ టైటిల్ రోల్లో నటిస్తోన్న మూవీ ‘కామ్రేడ్ కళ్యాణ్’. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 9న గ్రాండ్‌గా విడుదల కానుంది. విప్లవం సృష్టించడానికి కాకుండా, థియేటర్లలో పూర్తి స్థాయి నవ్వుల విప్లవాన్ని పంచడానికి ‘కామ్రేడ్ కళ్యాణ్’ వస్తున్నాడని చిత్ర యూనిట్ ఇప్పటికే సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేసింది. తాజాగా మేకర్స్ టీజర్ లాంచ్ చేశారు.
నక్సలైట్‌గా మారాలనుకున్నవ్యక్తి వెనుక ఓ కథ ఉంటుంది.. ఓ బాధ ఉంటుంది.. నీ కథేంటి..అని సాగే వాయిస్ ఓవర్‌తో మొదలైంది టీజర్. నక్సలైట్ అంటే ఏంటి.. నక్సల్ చేతిలో లైటు.. కమ్యూనిజం అంటే ఏంటీ.. కమ్యూనిస్టులు చెప్పే నిజం.. అందులో ఉన్న వేగుచుక్కలను, చీమల దండును ఊరు తండాలో చూసుకుందాం.. సాయి బుకింగ్స్ ఓపెన్ చేయి రా..? అంటూ శ్రీవిష్ణు స్టైల్లో సాగుతున్న డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.
పీరియడ్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న 1990ల కాలం నాటి వింటేజ్ ఫ్లేవర్‌లో.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని మాడుగుల నేపథ్యంతో తెరకెక్కుతోంది. ఈ మహిమా నంబియార్ హీరోయిన్గా నటిస్తుండగా, సత్య, ముక్కు అవినాష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. కోన వెంకట్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్నివెంకట కృష్ణ కర్నాటి, సీత కర్నాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తుండగా.. భాస్కరభట్ల సాహిత్యం సమకూరుస్తున్నారు.
January 12 Vidudala | వెంకీ, కళ్యాణ్ రామ్ మూవీకి లీకుల బెడద.. సెట్ నుండి బయటకొచ్చిన సాంగ్ వీడియోలు!
KTR | కేటీఆర్‌కు అలుగునూరులో ఘనస్వాగతం.. పోటీపడి రాఖీలు కట్టిన మహిళలు
New World Map: కొత్త ప్రపంచ పటం .. ఐక్యరాజ్యసమితి తీర్మానానికి అనుకూలంగా ఇండియా ఓటు