AP News | జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపే పోలింగ్.. సర్వం సిద్ధం చేశామన్న ఎన్నికల కమిషనర్..!
AP News | ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు పటిష్ఠమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్రపునేఠా స్పష్టంచేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పోలింగ్‌కు పెద్దగా ఇబ్బందులు ఉండబోవని ఆయన తెలిపారు. బుధవారం విజయవాడలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
AP News : ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు పటిష్ఠమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్రపునేఠా స్పష్టంచేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పోలింగ్‌కు పెద్దగా ఇబ్బందులు ఉండబోవని ఆయన తెలిపారు. బుధవారం విజయవాడలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాలని, ఇందుకోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఓటర్లకు, సిబ్బందికి అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎన్నికల కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ.. పోలింగ్ విధుల్లో 2.52 లక్షల మంది, కౌంటింగ్‌లో 52 వేల మంది సిబ్బంది పాల్గొంటారని తెలిపారు. పశ్చిమగోదావరి, గుంటూరు, బాపట్ల జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. పరిస్థితులను బట్టి పోలింగ్ కేంద్రాల్లో వీడియోగ్రఫీకి అనుమతిస్తామని, ప్రిసైడింగ్ అధికారులు తప్పనిసరిగా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని స్పష్టంచేశారు.
రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2.61 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. ఎన్నికల బందోబస్తుపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఒకే దశలో పోలింగ్ జరుగుతున్నందున రద్దీని నియంత్రించేందుకు తగినంత బలగాలను మోహరించామని తెలిపారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 582 జెడ్పీటీసీ స్థానాలు, 7,767 ఎంపీటీసీ స్థానాలకుగాను ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.
ఇప్పటికే 77 జెడ్పీటీసీ స్థానాలు, 2,051 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల బరిలో 2,169 మంది జెడ్పీటీసీ అభ్యర్థులు, 18,843 మంది ఎంపీటీసీ అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 2.61 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1.28 కోట్ల మంది పురుషులు, 1.32 కోట్ల మంది మహిళలు, 1,282 మంది ఇతరులు ఉన్నారు.
పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. ఓటర్ల సౌలభ్యం కోసం రాష్ట్రవ్యాప్తంగా 31,460 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. మొత్తం పోలింగ్ కేంద్రాల్లో 8,904 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా, 7,160 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఈ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచారు.
16,064 కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు, సుమారు 6,000 కేంద్రాల్లో ల్యాప్‌టాప్‌ల ద్వారా వెబ్‌కాస్టింగ్, 6,507 కేంద్రాల్లో వీడియోగ్రఫీ ద్వారా పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. ఎన్నికల విధుల కోసం 36,684 మంది ప్రిసైడింగ్ అధికారులను నియమించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం సుమారు 40,679 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. సిబ్బందిని, ఎన్నికల సామగ్రిని తరలించేందుకు 4,442 భారీ వాహనాలు, 3,200 తేలికపాటి వాహనాలను వినియోగిస్తున్నారు.
పోలింగ్ కోసం 1,01,618 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. ఓట్ల లెక్కింపు కోసం 365 కేంద్రాలను ఏర్పాటు చేయగా వాటిలో 9,062 కౌంటింగ్ టేబుళ్లను సిద్ధం చేశారు. గ్రామీణ ప్రాంతాలపై పట్టు నిరూపించుకునేందుకు ఈ ఎన్నికలు రాజకీయ పార్టీలకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపే పోలింగ్.. సర్వం సిద్ధం చేశామన్న ఎన్నికల కమిషనర్..!
Supreme Court Bench | చెన్నైలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయండి.. ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ
Iran | భారత నౌకలకు హర్మూజ్‌లో ప్రత్యేక మినహాయింపు ఇచ్చిన ఇరాన్..!
Panchayat Secretaries | డోన్ట్ కేర్.. హాజరు వేసుకొని ఇంటికెళ్తున్న పంచాయతీ కార్యదర్శులు..!
Double Murder | మీర్పేట్లో జంట హత్యల కలకలం.. పోలీసుల నిర్లక్ష్యమే కారణమా..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

