Supreme Court Bench | చెన్నైలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయండి.. ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ
Supreme Court Bench | తమిళనాడు రాజధాని చెన్నైలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సీఎం విజయ్ కోరారు. చిరకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ డిమాండ్‌ను అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతూ ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు.
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సీఎం విజయ్ కోరారు. చిరకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ డిమాండ్‌ను అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతూ ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. (Supreme Court Bench) చెన్నైలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏర్పాటు చేయడం వల్ల తమిళనాడుకే కాకుండా అన్ని దక్షిణ రాష్ట్రాలకూ ప్రయోజనం చేకూరుతుందని, దేశ నిజమైన సమాఖ్య స్వరూపాన్ని ప్రతిబింబిస్తుందని ఆ లేఖలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో న్యాయం పొందడానికి ఢిల్లీ వరకు ప్రయాణించవలసి వస్తున్న దక్షిణ రాష్ట్రాల ప్రజలు ఎదుర్కొంటున్న భౌగోళిక, ఆర్థిక ఇబ్బందులను ఆయన ప్రస్తావించారు.
కాగా, చెన్నైలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ 1980 నాటిదని సీఎం విజయ్ గుర్తు చేశారు. 1862లో స్థాపించిన మద్రాస్ హైకోర్టు, దేశంలోని పురాతన చార్టర్డ్ హైకోర్టులలో ఒకటి అని పేర్కొన్నారు. మద్రాస్ హైకోర్టు బార్ కౌన్సిల్ వృత్తిపరమైన సామర్థ్యాన్ని కూడా హైలైట్ చేశారు. దీంతో దక్షిణ రాష్ట్రాలకు అత్యున్నత న్యాయ సేవల కోసం చెన్నై వ్యూహాత్మకంగా ఉన్నదని వివరించారు.
అయితే 2007 ఆగస్ట్ 7న జరిగిన ఒక సమావేశంలో ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ గతంలో ఇచ్చిన తీర్మానాల నుంచి వైదొలగడానికి సుప్రీంకోర్టు ఫుల్ కోర్ట్‌కు ఎటువంటి సమర్థన కనిపించలేదని సీఎం విజయ్ తెలిపారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కోసం నివాస వసతితో సహా అవసరమైన మౌలిక సదుపాయాలను అందిస్తామని తమిళనాడు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
మరోవైపు 2016లో దాఖలైన ‘వి. వసంతకుమార్ వర్సెస్ హెచ్.సి. భాటియా, ఇతరులు’ అనే రిట్ పిటిషన్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక ఉత్తర్వును కూడా సీఎం విజయ్ ప్రస్తావించారు. భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి సూచించిన చట్టపరమైన ప్రశ్నలలో ప్రాంతీయ బెంచీల ఏర్పాటు కూడా ఒకటని పేర్కొన్నారు.
అలాగే సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రతిపాదనకు మద్దతుగా అనేక సిఫార్సులను విజయ్ తన లేఖలో ఉదహరించారు. 2004, 2006, 2008, 2021లో పార్లమెంటరీ స్థాయీ సంఘాలు చేసిన సిఫార్సులు, అలాగే శాశ్వత ప్రాంతీయ ధర్మాసనాల ఆవశ్యకతను పునరుద్ఘాటించిన లా కమిషన్ నివేదికలు ఉన్నాయని తెలిపారు.
కాగా, ప్రాంతీయ ధర్మాసనాలు న్యాయ స్వాతంత్ర్యాన్ని ప్రభావితం చేస్తాయన్న ఆందోళనలను సీఎం విజయ్ తోసిపుచ్చారు. భారత ప్రధాన న్యాయమూర్తి పరిపాలనా నియంత్రణను కలిగి ఉంటారు కాబట్టి, న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తికి ఇది ఎలాంటి భంగం కలిగించదని వాదించారు. చెన్నైలో బెంచ్ ఏర్పాటు విషయాన్ని సుప్రీంకోర్టుతో మళ్లీ ప్రస్తావించి అనుకూలమైన నిర్ణయం వచ్చేలా చూడాలని ప్రధాని మోదీని సీఎం విజయ్ ఆ లేఖలో కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపే పోలింగ్.. సర్వం సిద్ధం చేశామన్న ఎన్నికల కమిషనర్..!
Supreme Court Bench | చెన్నైలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయండి.. ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ
Iran | భారత నౌకలకు హర్మూజ్‌లో ప్రత్యేక మినహాయింపు ఇచ్చిన ఇరాన్..!
Panchayat Secretaries | డోన్ట్ కేర్.. హాజరు వేసుకొని ఇంటికెళ్తున్న పంచాయతీ కార్యదర్శులు..!
Double Murder | మీర్పేట్లో జంట హత్యల కలకలం.. పోలీసుల నిర్లక్ష్యమే కారణమా..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

