Rajnath Singh | రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) నేడు జమ్ముకశ్మీర్లో (Jammu And Kashmir) పర్యటించనున్నారు. అక్కడ 15 కార్ప్స్ ప్రధాన కార్యాలయం ఉన్న బాదామి బాగ్ కంటోన్మెంట్ను సందర్శించనున్నారు. రక్షణ మంత్రితోపాటు ఆర్మీ చీఫ్ జనరల్ (Army Chief General) ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedi) సైతం జమ్ము పర్యటనకు వెళ్లనున్నారు. నియంత్రణ రేఖ ప్రాంతాన్ని కూడా వీరు పరిశీలించనున్నట్లు తెలిసింది. అక్కడ సైన్యంతో చర్చలు జరపనున్నట్లు సమాచారం.
సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితి గురించి సైనికులను అడిగి తెలుసుకోనున్నారు. మరోవైపు కేంద్ర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు (Ram Mohan Naidu) సైతం ఇవాళ జమ్ము పర్యటనకు వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు శ్రీనగర్ చేరుకుంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు జమ్ముకు వెళ్లనున్నారు. కాల్పుల విరమణ తర్వాత సరిహద్దుల్లో తాజా పరిస్థితి గురించి ఆయన ఆరా తీయనున్నట్లు తెలిసింది.
Also Read..
Jammu | భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు.. థ్రాల్లో ఉగ్రవాది హతం
Indo-Myanmar Border | మణిపూర్లో ఎన్కౌంటర్.. పది మంది మిలిటెంట్లు హతం..
Chardham Yatra | చార్ధామ్ యాత్రకు భారీ స్పందన.. 150 దేశాల నుంచి రిజిస్ట్రేషన్లు..!