Jammu | జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలు-ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. థ్రాల్ ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నది. ప్రస్తుతం భద్రతా బలగాలు ఉగ్రవాదులను చుట్టుముట్టాయి. ముష్కరుల గురించి పక్కా సమాచారం అందుకున్న బలగాలు.. వారి కోసం కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న సమయంలో కాల్పులు చోటు చేసుకున్నట్లు జమ్మూ కశ్మీర్ పోలీసులు పేర్కొన్నారు. ఎన్కౌంటర్లో ఉగ్రవాదిని హతమార్చినట్లు బలగాలు తెలిపాయి. ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతుందని పోలీసులు పేర్కొన్నారు.ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. షోపియాన్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగిన 48 గంటల్లోనే థ్రాల్‌లో ఎదురుకాల్పులు జరిగాయి. మంగళవారం షోపియన్ జిల్లాలో మంగళవారం ఉదయం 8 గంటలకు ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. లష్కరే తోయిబా టాప్ కమాండర్ షాహిద్ కుట్టే, అద్నాన్ షఫీ, సహా ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి.
మూడో ఉగ్రవాదిని పుల్వామాకు చెందిన అహ్సాన్ ఉల్ షేక్‌గా గుర్తించారు. ఇక ఉగ్రవాదుల నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండును బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇందులో ఏకే 47 రైఫిల్స్, మ్యాగజైన్స్, గ్రెనేడ్స్ ఉన్నాయి. షోపియన్ జిల్లాలోని షుక్రు కెల్లర్ ప్రాంతంలోని అడవులలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందిందని జమ్మూ కాశ్మీర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. సమాచారం అందిన వెంటనే, పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG), 20 రాష్ట్రీయ రైఫిల్స్ (RR), సీఆర్పీఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. ఆ ప్రాంతాన్ని ముట్టడించి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆ తర్వాత ఉగ్రవాదులు బలగాలపైకి కాల్పులు జరిపారు. బలగాలు సైతం గట్టిగా బదులిచ్చారు. ఆ తర్వాత సంఘటనా స్థలంలో ముగ్గురు లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు హతమయ్యారు. షాహిద్ కుట్టే, అద్నాన్ షఫీ, అహ్సాన్ ఉల్ షేక్‌గా గుర్తించారు.
షాహిద్ కుట్టే షోపియన్‌లోని చోటిపోరా హిర్పోరా ప్రాంతంలో నివసించేవాడు. 2023లో లష్కరే తోయిబాలో చేరాడు. అతను లష్కరే తోయిబాకు చెందిన A- కేటగిరీ ఉగ్రవాది కాగా.. టాప్ కమాండర్‌గా పని చేస్తున్నారు. అతను అనేక ఉగ్రవాద సంఘటనలు, దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. 2024 ఏప్రిల్ 8న డానిష్ రిసార్ట్‌లో జరిగిన కాల్పుల ఘటనలో హస్తం ఉంది. ఈ ఉగ్రవాద దాడిలో జర్మనీకి చెందిన ఇద్దరు పర్యాటకులు, ఒక డ్రైవర్ గాయపడ్డారు. మే 18, 2024న హిర్పోరాలో జరిగిన సర్పంచ్ హత్యలో కుట్టే పాల్గొన్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 3న కుల్గామ్‌లోని బిహిబాగ్లో టీఏ (టెరిటోరియల్ ఆర్మీ) జవాను హత్యలో సైతం అతని ప్రమేయం ఉందని అనుమానిస్తున్నారు. ఇక షోపియన్‌కు చెందిన అద్నాన్ షఫీ గతేడాది అక్టోబర్‌లో లష్కర్లో చేరాడు. అక్టోబర్ 18, 2024న షోపియన్‌లోని స్థానికేతర కార్మికుడిని హత్యలో పాలుపంచుకున్నాడు. పుల్వామా జిల్లాలోని ముర్రాన్కు చెందిన అహ్సాన్ ఉల్ హక్ షేక్, సీ కేటగిరి ఉగ్రవాది కాగా.. 2023 జూన్ 24న ఉగ్రవాదిగా మారాడు.
J&K | Encounter has started at Nader, Tral area of Awantipora. Police and security forces are on the job. Further details shall follow. pic.twitter.com/ZICOdoXcbX
— ANI (@ANI) May 15, 2025