Massive Fire | ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం (Massive Fire) సంభవించింది. పితంపుర (Pitampura)లోని శ్రీ గురు గోవింద్ సింగ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (Sri Guru Gobind Singh College of Commerce)లో గురువారం ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.
ఫైర్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. తొలుత కళాశాల లైబ్రరీలో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత మంటలు ఇతర అంతస్తులకు వేగంగా వ్యాపించాయి. భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ కమ్ముకుంది. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. దాదాపు 11 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదులోకి తెచ్చారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
#WATCH | Delhi: Fire broke out at Sri Guru Gobind Singh College of Commerce in Pitampura today. 11 fire tenders rushed to the site and the fire was brought under control around 9.40 am. The fire broke out first in the library. Cooling operation continues: Delhi Fire Service… pic.twitter.com/HJ5O26jXSE
— ANI (@ANI) May 15, 2025
Also Read..
Rajnath Singh | నేడు జమ్ము కశ్మీర్ పర్యటనకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
Chardham Yatra | చార్ధామ్ యాత్రకు భారీ స్పందన.. 150 దేశాల నుంచి రిజిస్ట్రేషన్లు..!
Bus Catches Fire | స్లీపర్ బస్సులో చెలరేగిన మంటలు.. ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు సజీవ దహనం..!