President Murmu | ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన రఫేల్ యుద్ధ విమానంలో (Rafale Fighter Jet) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ప్రయాణించారు. బుధవారం ఉదయం హర్యాణా (Haryana)లోని అంబాలా వైమానిక స్థావరం (Ambala Air Force Base) నుంచి ఆమె రఫేల్ ఫైటర్ జెట్లో గగన విహారం చేశారు. ఈ ఏడాది మేలో పాక్పై చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో రఫేల్ యుద్ధ విమానాలు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ యుద్ధవిమానంలో రాష్ట్రపతి విహరించడం విశేషం.
కాగా, యుద్ధ విమానంలో ముర్ము విహరించడం ఇదేమీ మొదటిసారి కాదు. 2023లో సుఖోయ్ యుద్ధ విమానంలో రాష్ట్రపతి ప్రయాణించిన విషయం తెలిసిందే. అస్సాంలోని తేజ్పూర్ ఎయిర్ఫోర్స్ స్టేషన్ నుంచి సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానంలో విహరించారు. ఈ ప్రయాణం చేసిన రెండో మహిళా రాష్ట్రపతిగా ఆమె గుర్తింపు సాధించారు. అంతకుముందు 2009లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఈ ఫైటర్జెట్లో గగన విహారం చేసిన విషయం తెలిసిందే.
#WATCH | Haryana: President Droupadi Murmu takes off in a Rafale aircraft from the Ambala Air Force Station pic.twitter.com/XP0gy8cYRH
— ANI (@ANI) October 29, 2025
Also Read..
Rajasthan | గుర్రం 15 కోట్లు, దున్న 23 కోట్లు!
EPFO | పీఎఫ్ సీలింగ్ రూ.25,000కు పెంపు? ఈపీఎఫ్ఓ సన్నాహాలు
ముగ్గురు ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్లకు రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్