జైపూర్: ఈ ఏడాది రాజస్థాన్ పుష్కర్ పశువుల సంతలో రూ.15 కోట్ల విలువైన గుర్రం, రూ.23 కోట్ల దున్న ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చండీగఢ్‌కు చెందిన రెండున్నరేండ్ల వయసు గల షాబాజ్ పలు పోటీల్లో గెలుపొందిందని దాని యజమాని గేరీ గిల్ తెలిపారు. తన గుర్రం కవరింగ్ ఫీజు రూ.2 లక్షలని.. ఇప్పటి వరకు రూ.9 కోట్ల వరకు దానికి బేరం వచ్చిందని ఆయన తెలిపారు.
ఇక రాజస్థాన్‌కు చెందిన అన్మోల్ అనే దున్న ధర రూ.23 కోట్లని తెలుసుకొని అంద రూ నోరెళ్లబెడుతున్నారు. రూ.11 కోట్ల విలువైన గుర్రం, ఉజ్జయిన్‌కు చెందిన 600 కిలోల బరువున్న రాణా అనే రూ.25 లక్షల రేటున్న మరో దున్న ఈ సంతలో కొత్త ఆకర్షణగా నిలిచాయి.