CAG | దేశ ఆర్థిక నిఘా సంస్థ కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నూతన అధిపతిగా కె. సంజయ్ మూర్తి (K Sanjay Murthy) ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఉదయం రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో సంజయ్ మూర్తి చేత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Droupadi Murmu) ప్రమాణం చేయించారు. ఇప్పటి వరకూ కాగ్ (CAG) అధిపతిగా ఉన్న గిరీశ్ చంద్ర ముర్ము పదవీ కాలం ఈ నెల 20తో ముగిసింది (నిన్నటితో). దీంతో తదుపరి కాగ్ అధిపతిగా సంజయ్ మూర్తిని రాష్ట్రపతి నియమించారు.
మూర్తి హిమాచల్ ప్రదేశ్ క్యాడర్ 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం కేంద్ర విద్యా శాఖలో కార్యదర్శిగా ఉన్నారు. ఐఏఎస్ అధికారిగా ఆయన వచ్చే నెలలోనే ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్రం ఈ కీలక బాధ్యతలను అప్పగించింది.
#WATCH | Delhi: President Droupadi Murmu administers the oath of office to CAG K Sanjay Murthy at Rashtrapati Bhavan
(Source: President of India social media page) pic.twitter.com/byAQMyU2KE
— ANI (@ANI) November 21, 2024
Also Read..
AR Rahman | రెహమాన్ – సైరా భాను విడాకుల విషయంలో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు : లాయర్
PM Modi | మోదీకి అరుదైన గౌరవం.. అత్యున్నత పురస్కారాలతో సత్కరించిన డొమెనికా, గయానా