Bhagyashri Borse | టాలీవుడ్లో మరాఠీ భామ భాగ్యశ్రీ బోర్సో జోరు కొనసాగుతున్నది. రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచినా.. నటనకు మంచి మార్కులేపడ్డాయి. భాగ్యశ్రీ అందచందాలతో కుర్రాళ్లను చూపుతిప్పుకోకుండా చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగులో వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఇంత స్పీడ్‌గా బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్‌ని దక్కించుకున్న హీరోయిన్ భాగ్యశ్రీయే.
ప్రస్తుతం దుల్కర్ సల్మాన్, దగ్గుబాటి రాణా నటిస్తున్న ‘కాంత’ మూవీలో నటిస్తున్నది. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తున్న మూవీలో సైతం హీరోయిన్గా చేస్తున్నది. తాజాగా రామ్ పోతినేని హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమాలో హీరోయిన్గా ఎంపికైంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్‌కి ఎక్కడా తగ్గకుండా భాగ్యశ్రీని ఎంపిక చేశారు. మిస్టర్ బచ్చన్‌లో నటనతో పాటు డ్యాన్స్‌తో సైతం ఆకట్టుకున్నది.
మహేశ్ బాబు పీ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనున్నది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించనున్నారు. పూజ కార్యక్రమాలతో ఈ మూవీ నేడు (గురువారం) మొదలవనున్నది. ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ సమయంలోనే పాపులారీని సొంతం చేసుకున్న ఈ మరాఠా బ్యూటీ భవిష్యత్‌లో టాలీవుడ్లో అగ్రహీరోయిన్ ఎదిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. భాగ్యశ్రీ తెలుగు సినిమాలకు ముందు హిందీలో యారియాన్-2లో నటంచింది. సినిమాల్లోకి రావడానికి ముందు మోడలింగ్ నుంచి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.