Road Accident | యూపీ అలీఘర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఐదుగురు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మందికిపైగా గాయపడ్డారు. వారిని ఆసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. అలీఘర్‌లోని తప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో యమునా ఎక్స్‌ప్రెస్ హైవేపై బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట ప్రాంతంలో ట్రక్కు, డబుల్ డెక్టర్ బస్సు బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు మృతి చెందగా, 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
ప్రతాప్‌గఢ్‌కు చెందిన కృష్ణా ట్రావెల్స్‌కు చెందిన డబుల్ డెక్కర్ బస్సు ఢిల్లీ నుంచి అజాంగఢ్ వైపు వెళ్తున్న సమయంలోనే.. యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై పాయింట్ నంబర్ 56కి చేరుకోగానే వెనుక నుంచి ట్రక్కును ఢీకొట్టింది. వేగంగా ఢీకొట్టడంతో బస్సు భారీగా ధ్వంసమైంది. మృతుల్లో ఓ చిన్నారితో పాటు మహిళ ఉన్నారన్నారు. బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి లారీని ఢీకొట్టడంతో బస్ ముందుభాగం పూర్తిగా దెబ్బతిన్నది. ప్రమాదం అనంతరం బస్‌లోని క్షతగాత్రుల రోధనలు మిన్నంటాయి. ప్రమాదాన్ని గమనించిన పలువురు బస్ అద్దాలను పగులగొట్టి ప్రయాణికులను బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.