PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)కి మరో అరుదైన గౌరవం దక్కింది. గయానా, డొమెనికా దేశాలు తమ అత్యున్నత పురస్కారాలతో ప్రధానిని సత్కరించాయి. ప్రస్తుతం గయానా (Guyana) పర్యటనలో ఉన్న మోదీ ఈ రెండు పురస్కారాలను అందుకున్నారు.
ముందుగా డొమెనికా అధ్యక్షురాలు సిల్వానీ బర్టన్ తమ దేశ అత్యున్నత జాతీయ అవార్డు ‘డొమెనికా అవార్డ్ ఆఫ్ ఆనర్’తో (Dominica Award of Honour) మోదీని సత్కరించారు. కొవిడ్ సమయంలో తమ దేశానికి మోదీ అందించిన సహాయ సహకారాలకు గానూ ఈ అవార్డును అందించారు. అదేవిధంగా గయానా కూడా తమ దేశ అత్యున్నత పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ (The Order of Excellence)ను ఆ దేశాధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ మోదీకి అందించారు. ఈ సందర్భంగా రెండు దేశాలకు ప్రధాని మోదీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అవార్డును కోట్లాది మంది భారతీయులకు అంకితం ఇస్తున్నట్లు మోదీ ఎక్స్‌లో పోస్టు చేశారు.
Another great moment for 🇮🇳 as PM @narendramodi is awarded the highest national award of Guyana, “The Order of Excellence”.
Noting PM’s championing of the rights of the Global South and sharing India’s development journey with the world, the award is a true recognition of his… pic.twitter.com/hFXFBKZFv3
— Dr. S. Jaishankar (@DrSJaishankar) November 21, 2024
Also Read..
Road Accident | లారీని ఢీకొట్టిన డబుల్ డెక్కర్ బస్.. ఘటనలో ఐదుగురు దుర్మరణం
Air Pollution | గ్యాస్ ఛాంబర్‌గా మారిన ఢిల్లీ..! వాయు కాలుష్యంతో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు..!
Karnataka | జాతీయ రహదారిపై రివర్స్ తీసుకుంటున్న కారు.. మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన లారీ.. Video