National
- Dec 26, 2020 , 17:09:22
కుంభమేళా పనులపై అఖారాల అసంతృప్తి

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో 2021 కుంభమేళా పనులు ఇంకా ప్రారంభం కాకపోవడంపై అఖారాలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కుంభమేళా సన్నాహాలు ఇంకా ప్రారంభం కాలేదని, దీనిపై తాము సంతృప్తిగా లేమని అఖారా పరిషత్ చీఫ్ మహంత్ నరేంద్ర గిరి తెలిపారు. మేళా నిర్వహణపై సంబంధిత అధికారికి ఒక వినతిపత్రం సమర్పించినట్లు చెప్పారు. మేళా పనులను జనవరి 1న పరిశీలించాలని కోరుతూ ఉత్తరాఖండ్ సీఎంతోపాటు ఇతర అధికారులు తమను ఆహ్వానించారని అన్నారు. అయితే 12 ఏండ్లకు ఒకసారి జరిగే కుంభమేళా ఏర్పాట్లు ఇంకా ప్రారంభం కాకపోవడంపై అసంతృప్తిగా ఉన్నదని చెప్పారు. 2021 కుంభమేళా జనవరి 14 నుంచి ఏప్రిల్ 27 వరకు జరుగనున్నది. 9 ముఖ్య రోజుల్లో భక్తులు గంగానదిలో పవిత్ర పుణ్య స్నానాలు ఆచరిస్తారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
తాజావార్తలు
- నేడు ఐసెట్ మూడో విడుత కౌన్సెలింగ్ షెడ్యూల్
- చరిత్ర సృష్టించిన సెన్సెక్స్
- బీజేపీలో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త
- నేపాల్, బంగ్లాకు 30 లక్షల డోసుల కొవిషీల్డ్ వ్యాక్సిన్
- కల్తీ కల్లు ఘటన.. మత్తు పదార్థాలు గుర్తింపు
- స్వాతిలో ముత్యమంత సాంగ్‌ని రీమిక్స్ చేసిన అల్లరోడు-వీడియో
- ఫస్టియర్ ఫెయిలైన వారికి పాస్ మార్కులు!
- సింగరేణిలో భారీగా ట్రైనీ ఉద్యోగాలు
- అమ్మకు గుడి కట్టిన కుమారులు..
- టర్పెంటాయిల్ పోసి నిప్పంటించిన ఘటనలో బాలుడి మృతి
MOST READ
TRENDING