e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home News ప్రపంచ పర్యావరణ దినం: పీపీఈ కిట్ భూమిలో క‌ర‌గడానికి 500 ఏండ్లు

ప్రపంచ పర్యావరణ దినం: పీపీఈ కిట్ భూమిలో క‌ర‌గడానికి 500 ఏండ్లు

ప్రపంచ పర్యావరణ దినం: పీపీఈ కిట్ భూమిలో క‌ర‌గడానికి 500 ఏండ్లు

కరోనా వైర‌స్ నుంచి మ‌న‌ల్ని మ‌నం ర‌క్షించుకునేందుకు వినియోగించే పీపీఈ కిట్ (పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్).. ఈ పేరు ఇప్పుడు అంత‌టా సుప‌రిచిత‌మే. మ‌న‌ల్ని వైర‌స్ నుంచి రక్షించే ఈ పీపీఈ కిట్.. మ‌న అజాగ్ర‌త్త కార‌ణంగా ఎక్క‌డైనా పారేస్తే అది భూమిలో క‌రిగిపోవ‌డానికి క‌నీసం 500 సంవ‌త్స‌రాల స‌మ‌యం ప‌డుతుంది. ఇవేమీ తెలుసుకోకుండానే ప్ర‌జ‌ల్ని కాపాడే ప‌ర్యావ‌ర‌ణాన్ని మ‌న‌కు మ‌నంగానే నాశ‌నం చేస్తున్నాం.

కరోనా మ‌హ‌మ్మారి కూడా మన పర్యావరణానికి పెద్ద ముప్పు క‌లిగిస్తున్న‌ద‌నే చెప్పాలి. ఈ వైర‌స్‌ను క‌ట్ట‌డి చేయ‌డంలో ప్ర‌పంచం యావ‌త్తు ఎంతో ప్ర‌మాద‌క‌ర‌మైన బయో మెడికల్ వేస్ట్ (బీఎమ్‌డబ్ల్యూ) ఎత్తైన పర్వతాన్ని పెంచుతున్న‌ది. దీనిని అధిగమించడం చాలా క‌ష్ట‌మైన ప‌నిగా త‌యారైంది. క‌రోనా వైర‌స్ వ్యాధి చికిత్స‌లో వైద్యులు, ఇత‌ర ఫ్రంట్‌లైన్ సిబ్బంది విరివిగా ఉప‌యోగిస్తున్న పీపీఈ కిట్‌లో బాడీ సూట్, లోయర్, హెడ్ కవర్, బూట్ కవర్, గ్లోవ్స్ , పాలీప్రొఫైలిన్‌తో చేసిన గాగుల్స్ ఉన్నాయి. పీపీఈ కిట్‌ను వాడిన తర్వాత ఎక్కడో విసిరితే అది కుళ్ళిపోయి భూమిలో క‌లిసిపోవ‌డానికి 500 సంవత్సరాల స‌మ‌యం పడుతుంది. మూసిన కొలిమిలో కాల్చివేస్తే.. దాని నుంచి 3,816 కిలోల కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుంది. ఈ కార్బ‌న్ డ‌యాక్సైడ్‌ను గ్రహించడానికి ఒక‌ చెట్టుకు 182 రోజులు పడుతుంది.

పీపీఈ కిట్ త‌యారీ భిన్నంగా ఉంటుంది. మ‌న దేశంలో వినియోగిస్తున్న సింగిల్ యూజ్‌ పీపీఈ కిట్లు పాలీప్రోపోలీన్‌తో త‌యార‌వుతున్నాయి. వీటిలో 85 శాతం పాలీప్రోపోలీన్ ఉండ‌గా, 10 శాతం పాలీకార్బోనేట్‌, 4 శాతం ర‌బండ్‌, ఒక శాతం అల్యూమినియం ఉంటాయి. ప్ర‌స్తుతం మ‌న దేశంలో నిత్యం 5 ల‌క్ష‌ల పీపీఈ కిట్లు త‌యార‌వుతున్నాయి.

అదేవిధంగా, క‌రోనా వైర‌స్ నుంచి ర‌క్షించుకునేందుకు ప్రతిరోజూ మిలియన్ల కొద్ది వైద్య , ఎన్ -95 మాస్క్‌లు తయారుచేస్తున్నారు. నిత్యం మిలియన్ల లీటర్ల శానిటైజర్-క్రిమిసంహారక మందులు పర్యావరణంలో పిచికారీ చేస్తుండ‌టం కూడా పర్యావరణానికి పెద్ద ముప్పుగా పరిణమిస్తున్న‌ది. జ‌న‌వ‌రి నెల‌లో దేశం మొత్తం మీద ప్ర‌తినిత్యం 74 ట‌న్నుల బ‌యోమెడిక‌ల్ వేస్ట్ బ‌య‌ట‌కు రాగా, ఫిబ్ర‌వ‌రిలో నిత్యం 53 ట‌న్నులు, మార్చిలో 75 ట‌న్నులు, ఏప్రిల్ నెల‌లో 139 ట‌న్నులు, మే నెల‌లో నిత్యం 203 ట‌న్నులు బ‌యోమెడిక‌ల్ వేస్ వ‌చ్చిందని రికార్డులు చెప్తున్నాయి.

దుమ్ము, ధూళితో 15 శాతం మ‌ర‌ణాలు

మెడికల్ జర్నల్ కార్డియోవాస్కులర్ రీసెర్చ్‌లో ప్రచురించిన ఒక ప‌రిశోధ‌న పత్రం ప్రకారం, ప్రపంచంలో 15 శాతం మరణాలు నేరుగా విష రసాయనాలను కలపడం ద్వారా సృష్టించబడిన దుమ్ము, ధూళి, కలుషిత కణాలు వ‌ల్ల జ‌రుగుతున్నాయి. ప్రపంచ బ్యాంకు పాలసీ రీసెర్చ్ వర్కింగ్ పేపర్ ప్రకారం, భారతదేశంలో ప్రతి 1 శాతం రేణువుల కాలుష్యం (పీఎం 2.5) పెరుగుదలతో కరోనా మరణాల సంఖ్య 5.7 శాతం పాయింట్లు పెరుగుతుంది. ఈ మురికి కాలుష్యం కరోనా కార‌ణ‌ మరణ రేటును కూడా పెంచుతుంది.

  • ఇంట‌ర్నెట్ డెస్క్‌

ఇవి కూడా చ‌ద‌వండి..

చ‌రిత్ర‌లో ఈరోజు : ఐదుగురిలో తొలిసారి ఎయిడ్స్ గుర్తింపు

క‌రోనా టైం: స‌ప్లిమెంట్స్ న‌కిలీల‌ను ఇలా క‌నిపెట్టండి..!

లాక్‌డౌన్ ఎఫెక్ట్ : పిల్ల‌ల్లో పెరుగుతున్న ఊబ‌కాయం

కింగ్ కోబ్రా : శివాలిక్ కొండ‌ల్లో ద‌ర్శ‌నం

ఐఐటీయ‌న్ల ప్ర‌తిభ : అందుబాటులోకి హై ఫ్లో ఆక్సిజ‌న్ కాన్స‌న్‌ట్రేట‌ర్స్

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రపంచ పర్యావరణ దినం: పీపీఈ కిట్ భూమిలో క‌ర‌గడానికి 500 ఏండ్లు

ట్రెండింగ్‌

Advertisement