PM Modi | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నేడు పర్యటించనున్నారు. జాతుల మధ్య హింస చెలరేగిన తర్వాత ప్రధాని ఆ రాష్ట్రంలో తొలిసారి పర్యటించబోతున్నారు.
కాగా, కుకి, మైతీ వర్గాల మధ్య జాతి ఘర్షషణలు తలెత్తిన (Manipur violence) విషయం తెలిసిందే. మే 2023లో ప్రారంభమైన ఈ హింసలో దాదాపు 260 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ ఘర్షణల తర్వాత ఈశాన్య రాష్ట్రంలో ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో మోదీ పర్యటన దృష్ట్యా మణిపూర్ ప్రభుత్వం భద్రత కట్టుదిట్టం చేసింది. మరోవైపు ప్రధానికి వెల్కమ్ చెబుతూ ఇంపాల్ (Imphal)లో పోస్టర్లను ఏర్పాటు చేశారు. సమగ్ర, సుస్థిర, సమృద్ధికరమైన అభివృద్ధి (development projects) సాధించే దిశగా ప్రధాని మోదీ పర్యటన సాగనున్నది.
మణిపూర్‌లోని చురాచాంద్‌పుర్‌లో సుమారు రూ.7,300 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేయనున్నారు. మణిపూర్ అర్బన్ రోడ్స్, డ్రైనేజీ, అసెట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు కోసం రూ.3,600 కోట్లు ఖర్చు చేస్తున్నారు. రూ.2,500 ఖర్చుతో అయిదు జాతీయ రహదారులు నిర్మించనున్నారు. మణిపూర్ ఇన్ఫోటెక్ డెవలప్మెంట్ ప్రాజెక్టు, 9 ప్రదేశాల్లో వర్కింగ్ వుమెన్స్ హాస్టల్స్ నిర్మాణం కోసం పనులు ప్రారంభించనున్నారు. ఇంపాల్‌లో సుమారు రూ,1200 కోట్ల ఖర్చుతో చేపట్టనున్న అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరించనున్నారు. మణిపూర్‌తో పాటు మిజోరం, అస్సాం, బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మోదీ పర్యటించనున్నారు.
Also Read..
PM Modi | నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీల కర్కికి మోదీ శుభాకాంక్షలు
Road Blockade Case | రోడ్డు దిగ్బంధించారని.. కేంద్ర మాజీ మంత్రి సహా 14 మందికి రెండేండ్ల జైలు శిక్ష
మిజోరాంలో కొత్త రైల్వే లైన్ ప్రారంభం