చెన్నై: పోలీస్ వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఆ బైక్‌పై ప్రయాణించిన భార్యాభర్తలు, వారి రెండేళ్ల కుమారుడు ఈ ప్రమాదంలో మరణించారు. మరో మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాదంపై బంధువులు, స్థానికులు నిరసన తెలిపారు. (police vehicle hits Bike) తమిళనాడులోని శివగంగై జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 25 ఏళ్ల ప్రసాద్, తన భార్య అయిన 20 ఏళ్ల సత్య, వారి రెండేళ్ల కుమారుడు, సోనై ఈశ్వరి కలిసి రాత్రివేళ బైక్‌పై ఇంటికి తిరిగి వెళ్తున్నారు.
కాగా, తిరుప్పువనమ్ సమీపంలోని సక్కుడి క్రాసింగ్ వద్ద రామనాథపురం నుంచి వస్తున్న పోలీస్ వ్యాన్ ఆ బైక్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న ప్రసాద్ అక్కడికక్కడే మరణించాడు. గాయపడిన భార్య సత్య, రెండేళ్ల కుమారుడ్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయారు. తీవ్రంగా గాయపడిన సోనై ఈశ్వరిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న బాధిత కుటుంబం, స్థానికులు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. వాహనాలు నిలిచిపోవడంతో పోలీస్ ఉన్నతాధికారులు అక్కడకు చేరుకున్నారు. పారిపోయిన డ్రైవర్‌పై చర్యలు చేపడతామని, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో నిరసన విరమించిన తర్వాత ట్రాఫిక్ క్లియర్ అయ్యింది.
Also Read:
Delhi bomber owned 2nd car | ఢిల్లీ మానవ బాంబర్‌కు రెండో కారు.. ఎకోస్పోర్ట్ కోసం పోలీసులు గాలింపు
Watch: ఫ్లైఓవర్ పిల్లర్ లోపల నిద్రించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?