PM Modi | భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఇథియోపియా పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని ఆ దేశ పార్లమెంట్ Ethiopian Parliament)లో ప్రసంగించారు. సింహాలకు నిలయమైన ఇథియోపియాలో ఉంటే సొంత ఇంట్లో ఉన్నట్లుందని తెలిపారు.
‘ఇథియోపియా సింహాలకు నిలయం. నా స్వస్థలం గుజరాత్ (Gujarat) కూడా సింహాలకు నిలయమే. అందుకే నాకు ఇక్కడ ఉంటే సొంతింట్లో ఉన్న భావన కలుగుతోంది. ఈ దేశంతో భారత్కు సత్సంబంధాలున్నాయి. ఇరు దేశాల జాతీయ గీతాలు ప్రజల్లో మాతృభూమి పట్ల గర్వాన్ని, ప్రేమను, దేశభక్తిని ప్రేరేపిస్తాయి’ అని ప్రధాని తెలిపారు. భారతదేశంలోని 1.4 బిలియన్ల ప్రజల తరపున ఆ దేశానికి స్నేహపూర్వక సోదరభావ శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ పర్యటనలో ప్రధాని మోదీకి అపూర్వ గౌరవం లభించింది. ఇథియోపియా ప్రభుత్వం ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం ‘గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’తో సత్కరించింది. అదిస్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఇథియోపియా ప్రధాని డాక్టర్ అబి అహ్మద్ అలీ ఆయనను అవార్డుతో సత్కరించారు.
Also Read..
Vande Mataram | వందేమాతరం ఆలపించిన ఇథియోపియన్ గాయకులు.. పులకరించిపోయిన ప్రధాని మోదీ
Anant Ambani | మెస్సికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ.. ఎన్నికోట్లంటే..?