Anant Ambani | తన గోట్ ఇండియా టూర్ (GOAT India Tour)లో భాగంగా అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ (Football icon) లియోనల్ మెస్సి (Lionel Messi).. గుజరాత్‌లోని జామ్‌నగర్‌ను సందర్శించిన విషయం తెలిసిందే. ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani) స్థాపించిన వన్యప్రాణుల సంరక్షణ, పునరావాసం, పరిరక్షణ కేంద్రం అయిన వంతారా (Vantara)ను విజిట్ చేశారు. అక్కడ జంతువులతో మెస్సి సరదాగా సమయాన్ని గడిపారు. వంతారాను విజిట్ చేసిన మెస్సికి అనంత్ అంబానీ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. తన గుర్తుగా రిచర్డ్ మిల్లె వాచ్‌ని ఫుట్‌బాల్ స్టార్‌కు బహుమతిగా ఇచ్చారు.
పలు నివేదికల ప్రకారం.. వంతారా సందర్శనకు వెళ్లేటప్పుడు మెస్సి చేతికి ఎలాంటి వాచ్ లేదు. అనంత్‌తో మీటింగ్ తర్వాత అతడి చేతిపై ఓ అరుదైన, అత్యంత ఖరీదైన గడియారం దర్శనమిచ్చింది. ఆ వాచ్ రిచర్డ్ మిల్లె RM 003-V2 GMT (Richard Mille RM 003-V2 GMT) టూర్‌బిల్లాన్ ఆసియా ఎడిషన్. ఇలాంటివి ప్రపంచంలో కేవలం 12 పీస్‌లు మాత్రమే ఉంటాయి. దీని ధర దాదాపు 1.2 మిలియన్ డాలర్లుగా నివేదికలు పేర్కొంటున్నాయి. అంటే మన భారత కరెన్సీలో దాదాపు రూ. 10.91 కోట్లు అన్నమాట. ఈ గడియారాన్ని అనంత్ అంబానీ మెస్సికి బహుమతిగా ఇచ్చినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇక అనంత్ అంబానీ సైతం ఇలాంటి మరోవాచ్‌ను ధరించడం విశేషం. రిచర్డ్ మిల్లె RM 056 సఫైర్ టూర్‌బిల్లాన్ అనంత్ చేతికి కనిపించింది. దీని విలువ దాదాపు దాదాపు 5 మిలియన్ డాలర్లుగా తెలుస్తోంది. అంటే రూ.45.59 కోట్లన్నమాట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Global football icon Lionel Messi made a special visit to Vantara. At the centre, initiatives traditionally begin with seeking blessings in accordance with Sanatana Dharma. Messi’s visit reflected this cultural ethos as he participated in traditional Hindu rituals, observed… pic.twitter.com/0JNiAbtlGW
— ANI (@ANI) December 16, 2025
Also Read..
Lionel Messi | నమస్తే ఇండియా.. ఇంత గొప్ప ఆతిథ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు : మెస్సి
Mahatma Gandhi | హే రామ్!.. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్ముడిపేరు తొలగింపు..
Digital Arrest | డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.2 కోట్ల లూటీ