బెంగళూరు: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని బెంగళూరుకు చెందిన ఒక మహిళా లెక్చరర్ రూ.2 కోట్లను పోగొట్టుకున్నారు. సైబర్ నేరగాళ్లు ఆమెను డిజిటల్ అరెస్ట్ చేయడంతో ఆమె ప్ల్లాట్, మరో రెండు నివాస ఫ్లాట్లను అమ్మి వారికి సొమ్ములు చెల్లించింది. విజ్ఞాన్ నగర్లో బబితా దాస్ 10 ఏండ్ల కొడుకుతో నివసిస్తోంది. జూన్లో ఆమెకు ఒక కొరియర్ కార్యాలయం పేరిట ఒక కాల్ వచ్చింది.
ఆమె ఆధార్ కార్డుకు లింకై ఉన్న ఒక బ్యాగేజ్లో అనుమానాస్పద పార్సిల్ ఉందని ఆ వ్యక్తి తెలిపాడు. తర్వాత పోలీసుల పేరుతో బెదిరించి తమ మాట వినకపోతే వారి కుమారుడు చిక్కుల్లో పడతాడని బెదిరించాడు. తర్వాత ఆమె ఆస్తులమ్మించి ఆమె నుంచి రూ.2 కోట్లు కొట్టేశారు. వారికి చెల్లించడానికి ఆమె అప్పు కూడా చేశారు.